Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కోసమే పోటీ వద్దనుకున్న టిడిపి

పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారనే ప్రచారం అధినేతను కలవర పరుస్తున్న వేళ కొరివితో తల గోక్కోటం ఎందుకుని అనుకున్నట్లున్నారు.

Tdp withdraws contest plan for the sake of lokesh

ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఆరో అభ్యర్దిని పోటీ పెట్టాలన్న ఆలోచన నుండి టిడిపి ఎందుకు వెనక్కు తగ్గింది? ఎంఎల్ఏ కోటాలో రాష్ట్రంలో ఏడు స్ధానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో టిడిపికి 5, వైసీపీకి 2 స్ధానాలు పోటీ లేకుండా దక్కుతాయి. ప్రతీ ఎంఎల్సీకి 23 ఓట్లు అవసరం. వైసీపీకి 46 ఎంఎల్ఏలు, టిడిపికి 130 ఎంఎల్ఏలున్నారు. ఇందులో  21 మంది ఫిరాయింపు ఎంఎల్ఎలు కలిసే ఉన్నారులేండి. దీని ప్రకారం వైసీపీకున్న 46 ఎంఎల్ఏలతో రెండు స్ధానాలకు ఢోకా లేదు. అదేవిధంగా టిడిపికున్న 130 ఎంఎల్ఏలతో 5 స్ధానాలు ఈజీగా దక్కించుకుంటుంది. అంటే ఇంకా టిడిపి వద్ద 15 ఓట్లు అదనంగా ఉంటాయి.

 

ఇక్కడే టిడిపి కుట్రపూరితమైన ఆలోచనలు చేసింది. తనకు మిగిలే 15 ఎంఎల్ఏల బలంతో ఆరో సీటుకు ఎందుకు పోటీ పెట్టకూడదని యోచించింది. వైసీపీని గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసింది. ఆరో సీటుకు అవసరమైన 8 మంది ఎంఎల్ఏల బలాన్ని సంపాదించుకోవాలలని అనుకున్నది. వైసీపీకున్న 46 మంది ఎంఎల్ఏల్లో మరికొందరిని లాక్కుంటే ప్రతిపక్షం పని అయిపోతుందని ఆలోచించింది. అందుకు వ్యూహాలు కూడా మొదలుపెట్టింది. అయితే, అన్నీ రకాలుగా ఆలోచించిన తర్వాత పోటీకి పెట్టకపోవటమే మంచిదని నిర్ణయించుకున్నది.

 

వైసీపీ బలాన్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ వేస్తే అది తన మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందని అనుమానించింది. ఎందుకంటే, ఆరో సీటుకు పోటీ అంటే మొత్తం అన్నీ సీట్లకూ పోటీ తప్పదు. ఏడు సీట్లలో ఏ ఒక్క సీటుకు పోటీ అన్నా మొత్తం ఏడుగురు అభ్యర్ధులూ పోటికి సిద్ధపడాలి. ఇందులో లోకేష్ సీటు కూడా ఉంది. ఈ దశలో టిడిపి తరపున పోటీ చేసేందుకు అవకాశం రాని ఎంఎల్ఏలు ఎవరైనా అధికారిక అభ్యర్ధులకు హ్యాండ్ ఇచ్చే ప్రమాదం ఉందని నాయకత్వం అనుమానించినట్లు సమాచారం. అంటే ‘ఉన్న నాలకకు మందేస్తే కొండ నాలుక పోయి’నట్లన్నమాట. అసలే పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారనే ప్రచారం అధినేతను కలవర పరుస్తున్న వేళ కొరివితో తల గోక్కోటం ఎందుకుని అనుకున్నట్లున్నారు. కాబట్టే ఆరో సీటుకు పోటిని విరమించుకున్నారు. అంటే లోకేష్ ను ఏకగ్రీవం చేసేందుకే టిడిపి పోటీని నివారించింది. నిజంగా చంద్రబాబు బుర్ర సూపర్బ్.

Follow Us:
Download App:
  • android
  • ios