Asianet News TeluguAsianet News Telugu

ఐదు చోట్ల రీ పోలింగ్: తిరుపతి సబ్‌కలెక్టర్‌ ఎదుట టీడీపీ ధర్నా

 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  ఐదు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని  ఈసీ తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం నాడు చిత్తూరు సబ్ కలెక్టరేట్ వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది.
 

tdp leaders protest dharna infront of tirupati sub collectorate office
Author
Tirupati, First Published May 16, 2019, 11:44 AM IST

తిరుపతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  ఐదు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని  ఈసీ తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం నాడు చిత్తూరు సబ్ కలెక్టరేట్ వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది.

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో  రీ పోలింగ్ కేంద్రాల్లో ఈసీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది.  వైసీపీ వినతి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది.

ఐదు చోట్ల  టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని...ఈ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే పోలింగ్ జరిగిన మరునాడే 27 కేంద్రాల్లో చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ అభ్యర్థి పులివర్తి వాసు ఈసీని కోరారు. కానీ, ఈ వినతిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించాలని  నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ తీసుకొన్న నిర్ణయాన్ని  వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతించారు.

ఈసీ తీసుకొన్న రీ పోలింగ్ నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతి సబ్ కలెక్టరేట్  ఎదుట పులివర్తి నాని, మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పలువురు ధర్నాకు దిగారు.  ఈ నెల 19వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కానీ,తాము కోరిన చోట ఎందుకు రీ పోలింగ్ నిర్వహించడం లేదో చెప్పాలని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిర్ణయాలు ఏక పక్షంగా ఉన్నాయని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios