Asianet News TeluguAsianet News Telugu

నేను బాగు చేయడం.. వీళ్లు నాశనం చేయడం: జగన్‌పై బాబు ఫైర్

కరెంట్ కోతలతో రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్లిందని బాబు తెలిపారు. టీడీపీ హయాంలో కరెంట్ కోతలు తగ్గిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం సీఎం జగన్ పీపీఏలపై సమీక్ష చేశారని చంద్రబాబు ఆరోపించారు.

tdp chief chandrababu naidu fires on ap cm ys jagan over sand scarcity
Author
Visakhapatnam, First Published Oct 10, 2019, 12:28 PM IST

విశాఖ జిల్లా టీడీపీ సమీక్షా సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఆయనకు స్వాగతం పలికారు.

కరెంట్ కోతలతో రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్లిందని బాబు తెలిపారు. టీడీపీ హయాంలో కరెంట్ కోతలు తగ్గిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కమీషన్ల కోసం సీఎం జగన్ పీపీఏలపై సమీక్ష చేశారని చంద్రబాబు ఆరోపించారు. 11.67 పైసలు కరెంట్ కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఓవరాక్షన్ చేస్తున్న పోలీసులను బాబు హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఇసుక సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. లారీ ఇసుక ప్రస్తుతం రూ.80 వేలకు చేరుకుందని, 30 లక్షల మంది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు.

పనులు లేక ఈ ఏడాది ఎన్నో కుటుంబాలు దసరా పండుగను సైతం జరుపుకోలేకపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios