Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై దాడి: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శ్రీనివాసరావు చేతిరాత

 వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు  చేతి రాతను  ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు కోర్టు పంపింది. 

srinivasa rao handwriting sent to forensic lab
Author
Vizag, First Published Nov 20, 2018, 12:52 PM IST


విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు  చేతి రాతను  ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు కోర్టు పంపింది. జగన్‌పై ఎందుకు దాడికి పాల్పడ్డానో 11 పేజీల లేఖ ద్వారా శ్రీనివాసరావు వివరించారు.ఈ చేతి రాత శ్రీనివాసరావుదో కాదో శాస్త్రీయంగా నిరూపించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో  శ్రీనివాసరావు  కత్తితో దాడికి పాల్పడ్డాడు. తాను ఎందుకు జగన్‌పై దాడికి పాల్పడ్డాననే విషయాన్ని 11 పేజీల లేఖలో రాసినట్టుగా శ్రీనివాసరావు మీడియాకు గతంలోనే చెప్పారు.

ఇదిలా ఉంటే  శ్రీనివాసరావు రాసిన లేఖను సిట్ అధికారులు  గతంలోనే మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖపై  వైసీపీ నేతలు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. 

ఇంటర్ వరకు చదివిన శ్రీనివాసరావు  రేవతిపతీ, విజయదుర్గలతో కూడ ఈ లేఖను రాయించాడు. ఎందుకు ఇతరులతో శ్రీనివాసరావు ఈ లేఖను రాయించాడనే  విషయమై కూడ సిట్  ఆరా తీశారు. 

ఇదిలా ఉండగా శ్రీనివాసరావు చేతిరాతను పరీక్షించాలని సిట్ అధికారులు  కోర్టును కోరారు. మంగళవారం నాడు కోర్టు సమక్షంలో  శ్రీనివాసరావు ఆరు పేజీలు లేఖ రాశాడు.  ఈ చేతిరాతను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కోర్టు పంపింది. 

శ్రీనివాసరావు చేతి రాతతో పాటు రేవతీపతి, విజయదుర్గ చేతి రాతను కూడ  ఎఫ్ఎస్ఎల్‌‌కు పంపింది.ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం  సిట్ అధికారులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

దాడి: జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన సిట్

జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

 

Follow Us:
Download App:
  • android
  • ios