Asianet News TeluguAsianet News Telugu

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

భర్త అనిల్ కుమార్, వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన షర్మిల తన పిటిషన్ ను కమిషర్ కు అందించారు. తన ఫిర్యాదులో ఆమె సెంటిమెంట్ తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేశారు. 

Sharmila's petition forwarded to Cyber cell
Author
Hyderabad, First Published Jan 14, 2019, 3:08 PM IST

హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేసిన ఫిర్యాదును హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సైబల్ సెల్ కు పంపించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని ఆయన సెబర్ సెల్ ను సోమవారంనాడు ఆదేశించారు. 

భర్త అనిల్ కుమార్, వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన షర్మిల తన పిటిషన్ ను కమిషర్ కు అందించారు. తన ఫిర్యాదులో ఆమె సెంటిమెంట్ తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేశారు. 

"చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా, మేం ఆ పనిచేయలేమా, మాకు ఆ తెలివి లేదా, మాకు విలుపలు ఉన్నాయి కాబట్టి ఆ పనిచేయడం లేదు" అని షర్మిల మీడియాతో అన్నారు.

ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తారని అన్నారు. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కూడా ఆమె లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేకనే తాను హైదరాబాదులో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

Follow Us:
Download App:
  • android
  • ios