Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక: ప్రజలను రక్షించిన కచ్చులూరు వాసులకు జగన్ నజరానా

కచ్చులూరు గ్రామస్తుల వల్లే 26 మంది ప్రాణాలతో బయటపడ్డారని వారి సాహసానికి గుర్తుగా ఒక్కొక్కరికి రూ.25 వేలు నగదు బహుమతి ఇస్తామని మంత్రి వెల్లడించారు

rewards for bravery: The people of Kachchaloor who saved the lives
Author
Amaravathi, First Published Sep 27, 2019, 5:58 PM IST

కచ్చులూరు పడవ ప్రమాదంలో ఇంకా 14 మంది ఆచూకీ లభించాల్సి వుందన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గల్లంతైన వారిలో తెలంగాణకు చెందినవారు ఆరుగురు, ఏపీకి చెందిన వారు ఎనిమిది మంది ఉందన్నారు.

బోటు ప్రమాదంపై ఇప్పటికే జ్యూడీషియల్ విచారణ జరుగుతోందని, అలాగే ఒక ప్రత్యేక కమిటీని సీఎం నియమించారని మంత్రి తెలిపారు.

భవిష్యత్తులో నీటి మీద ప్రయాణాల సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా , శాఖల మధ్య సమన్వయంపైనా సిఫారసులు అందించేందుకు మరో కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని కన్నబాబు గుర్తు చేశారు.

ఆ కమిటీలో జలవనరులు, పోర్టులు, పర్యాటక శాఖ, జిల్లా కలెక్టర్ ఉంటారని తెలిపారు. కచ్చులూరు వద్ద గోదావరి చాలా లోతుగా ఉంటుందని, ఈ సమయంలో బోటు సుడిగుండంలో ఇరుక్కుని ప్రమాదానికి గురైందన్నారు.

నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు మరికొన్ని కారణాల కారణంగా బోటును బయటకు తీయడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారిందని కన్నబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం నదీగర్భంలో 250 నుంచి 300 అడుగుల లోతులో బోటు ఉందన్నారు.

నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంకా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని.. చివరికి వారు వెళ్తున్న బోటు కూడా వరదలో చిక్కుకుందని కన్నబాబు వెల్లడించారు.

బోటును తీస్తామంటూ చాలామంది ముందుకు వస్తున్నారని.. ఛత్తీస్‌గఢ్, ముంబై, కాకినాడ నుంచి నిపుణులను రప్పించామని మంత్రి పేర్కొన్నారు. బోటు తీస్తామని వస్తున్నవారు ఉన్నతాధికారులు, నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రయత్నించవచ్చని కన్నబాబు స్పష్టం చేశారు.

బోటు ప్రమాదంపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత్‌లో ఇంతవరకు ఇంత లోతులో బోటు మునిగిపోయిన దాఖలాలు లేవన్నారు.

కచ్చులూరు గ్రామస్తుల వల్లే 26 మంది ప్రాణాలతో బయటపడ్డారని వారి సాహసానికి గుర్తుగా ఒక్కొక్కరికి రూ.25 వేలు నగదు బహుమతి ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఆచూకీ లభించని వారికి ప్రభుత్వం తరపు నుంచి డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని కన్నబాబు స్పష్టం చేశారు.

నీటిపై ప్రయాణాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సరైన స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. బోటును నడిపిన వ్యక్తికి 30 ఏళ్ల అనుభవం ఉందని అయితే కచ్చులూరు వద్ద గోదావరి ఉద్ధృతిని అతను అంచనా  వేయలేకపోయారని కన్నబాబు తెలిపారు.

ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ రోజు బోటులో 77 మంది ప్రయాణించారని మంత్రి స్పష్టం చేశారు. 


సంబంధిత వార్తలు:

బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

బోటు ప్రమాద నిందితుల అరెస్ట్: ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios