Asianet News TeluguAsianet News Telugu

వారంలోగా ప్రధాన అర్చకుడినవుతా: రమణ దీక్షితులు

ఆగమ సలహామండలి సభ్యుడిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నారు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తన రీ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. వారం లోగా శ్రీవారి ప్రధాన అర్చక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. 

ramana dikshitulu comments on his re entry in tirumala temple
Author
Tirumala, First Published Nov 6, 2019, 6:22 PM IST

ఆగమ సలహామండలి సభ్యుడిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నారు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తన రీ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. వారం లోగా శ్రీవారి ప్రధాన అర్చక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని.. అర్చకులంతా సీఎంకు రుణపడివున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదవీ విరమణ నిబంధనను తొలగిస్తానని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని రమణ దీక్షితులు వెల్లడించారు. 

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఆయనకు టీటీడీ ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లుగా తెలిపింది. రమణ దీక్షితులను టీటీడీ ఆగమ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఆలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణ దీక్షితులు సేవలందించనున్నారు.

Also Read:రమణ దీక్షితులకు లైన్ క్లియర్: టీటీడీలోకి రీఎంట్రీ.. కోర్టు కేసుల తర్వాతే

కోర్టు కేసుల పరిష్కారం తర్వాత బాధ్యతలు అప్పగించాలని టీటీడీ బోర్డు భావిస్తోంది. యువ అర్చకుల అందరికీ శ్రీవారి ఆలయ సాంప్రదాయలు, నియమ నిబంధనలు, ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలపై రమణ దీక్షితులతో శిక్షణ ఇప్పించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రమణ దీక్షితులు ఇద్దరు కుమారులకు కూడా అర్చకత్వ బాధ్యతలు అప్పగించాలని టీటీడీ బోర్డు భావిస్తోంది. 

టీటీడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనానికి తెర తీశారు. టీటీడీ లోని అక్రమాల్లో టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ అప్పట్లో అతనికి మద్దతు పలికింది కూడా. దీనితో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రమణ దీక్షితులు తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారని భావించారంతా. 

ఎన్నికలకు ముందు జగన్ ను హైదరాబాద్ లో రమణ దీక్షితులు కలిసాడు. ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వచ్చినప్పుడు జగన్ ను కలుసుకొని పట్టు వస్త్రం కప్పి సత్కరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రమణ దీక్షితులు ఇక మరోమారు ఆలయంలోకి వచ్చినట్టే అని అంతా అనుకున్నారు. టీటీడీ కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే దీనికి సంబంధించిన తీర్మానం చేస్తారనే వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. 

కాకపోతే పాలక మండలి రెండు సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారం రోజుల కింద అర్చకుల వారసత్వ హక్కులను సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన చూసినవారంతా రమణ దీక్షితులుకు లైన్ క్లియర్ అయ్యిందనుకున్నారు.

Also read:వజ్రం వ్యవహారం: డోలాయమానంలో రమణ దీక్షితులు పరిస్థితి

అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ప్రభుత్వం ఈ ప్రకటనలో చిన్న మెలిక పెట్టింది. టీటీడీ మినహా మిగితా అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మరోసారి నిరాశకు గురవ్వాల్సి వచ్చింది రమణ దీక్షితులు. 

తాజాగా రెండు రోజుల కింద ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో సారి రమణ దీక్షితులు మనసులో ఆశలు రేకెత్తించినట్టే రేకెత్తించి మళ్లీ నీళ్లు చల్లేసినట్టయింది.

టీటీడీలో పదవీ విరమణ పొందిన అర్చకులను మల్లి తీసుకుంటామని అన్నారు. కాకపోతే ప్రధాన అర్చకులుగా తీసుకోలేమని, ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులకు స్థాన చలనం ఉండబోదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios