Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై సుప్రీం విచారణకు సంతకాలు: స్పందన కరువు

ఈ పిటిషన్ మొదలయి రెండు వారాలు దాటినా  ఇప్పటికి  366 మంది  మాత్రమే సంతకాలు చేశారు

poor response to signature campaign against Jagan

వైసిపి నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్  జగన్మోహన్ రెడ్డిని కేసులన్నింటిని సుప్రీం కోర్టు పర్యవేక్షణకు బదిలీ చేయాలని కోరుతూ  టిడిపి అభిమానుల సంతకాల సేకరణ ఉద్యమం మొదలయింది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడి ఆస్తుల మీద నిష్పాక్షికంగా సుప్రీంకోర్టు  దర్యాప్తు చేయాలని కొంతమంది సంతకాలు సేకరించిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది.

 

దీనికి పోటీ గా ఇపుడు జగన్మోహన్ రెడ్డి మీద  దర్యాప్తు చేయాలని మురళీ ప్రసాద్ అనే వ్యక్తి  చేంజ్ డాట్ అర్గ్ ద్వారా సంతకాల  సేకరణ ప్రారంభించాడు.  అయితే, దీనికంత స్పందన వచ్చినట్లు కనిపించదు. ఎందుకంటే, ఈ పిటిషన్ మొదలయి రెండు వారాలు దాటినా  366 మంది ( ఈ వార్త రాస్తున్నప్పటికి) మాత్రమే సంతకాలు చేశారు.

 

తండ్రి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైఎస్ జగన్ అధికారాన్ని  దుర్వినియోగ పర్చాడని,ఇలా రు.47,000 కోట్ల ప్రజాధనం వెనకేసుకున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు.  సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించిన 47కేసులలో జగన్ ఎ.1 అని చెబుతూ  జగన్ లాంటి నేరస్థుడు స్వేచ్ఛగా తిరగకుండా నివారించడానికి  ఈ కేసులను సుప్రీం కోర్టుకు బదలాయించేందుకు సిబిఐ మీద వత్తిడి తీసుకురావాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ సారంశం ఇదే.

 

“YS Jagan had abused his father's power as Chief Minister of the then united Andhra Pradesh and siphoned off more than 47,000 crores of public money. The magnitude of the scam is unheard of. YS Jagan is an A-1 accused in 47 cases that are being investigated by the CBI. The Supreme Court had recently suggested that such cases must be dealt with strictly and culprits be prosecuted within a year. It is time that we rise up and compel the CBI to transfer the case to Supreme Court so that a criminal like Jagan does not walk free, spending our hard earned money.”

Follow Us:
Download App:
  • android
  • ios