Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన అనుచరులు స్కెచ్ వేసినట్టుగా పోలీసులు గుర్తించారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కొన్ని కీలకమైన సాక్ష్యాలను సిట్ బృందం సేకరించినట్టు తెలుస్తోంది

police arrested nagappa and madhu in ys vivekanda reddy
Author
Pulivendula, First Published Mar 22, 2019, 10:41 AM IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన అనుచరులు స్కెచ్ వేసినట్టుగా పోలీసులు గుర్తించారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కొన్ని కీలకమైన సాక్ష్యాలను సిట్ బృందం సేకరించినట్టు తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు.ఈ మేరకు  ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన నాటి నుండి ఆయన ప్రధాన అనుచరుడు గంగిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గంగిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

పులివెందుల నియోజకవర్గానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కూడ నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య  జరిగిన రోజున  చంద్రశేఖర్ రెడ్డి  పులివెందులలో ఓ స్కార్పియోలో తిరిగినట్టుగా పోలీసులు కీలకమైన సాక్ష్యాన్ని సేకరించారు.

చంద్రశేఖర్ రెడ్డి స్కార్పియోలో మరో రౌడీ షీటర్ చిన్నాతో కలిసి తిరిగిన సీసీ పుటేజీని సిట్ బృందం స్వాధీనం చేసుకొంది. వారం రోజులుగా రౌడీ షీటర్ చిన్నాతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి తిరిగాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో వైపు గంగిరెడ్డి అనుచరులు నాగప్ప, మధులను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

బెంగుళూరులోని  రూ.125 కోట్ల ఆర్థిక లావాదేవీలపై గంగిరెడ్డికి  వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు బెంగుళూరుకు వెళ్లి సిట్ బృందం విచారణ చేస్తోంది.

వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని ఆయన భార్య లక్ష్మి ఇప్పటికే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.మరో వైపు ఈ కేసులో శాస్త్రీయ ఆధారాల కోసం  కోసం సిట్ బృందం ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

Follow Us:
Download App:
  • android
  • ios