Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌తో చర్చలపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదీ...

గణతంత్ర దినోత్సవం సందర్భంగా  ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమంలో  తాను కేసీఆర్‌తో మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పోరాటం చేసిన వాళ్లంటే తనకు గౌరవమన్నారు. 

pawan kalyan reacts on meeting with kcr at raj bhavan
Author
Vijayawada, First Published Jan 28, 2019, 12:00 PM IST


అమరావతి:గణతంత్ర దినోత్సవం సందర్భంగా  ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమంలో  తాను కేసీఆర్‌తో మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పోరాటం చేసిన వాళ్లంటే తనకు గౌరవమన్నారు. చట్టసభల్లో పదవుల్లో ఉన్నవారంటే కూడ తనకు అమితమైన గౌరవమనే విషయాన్ని ఆయన తెలిపారు.

తాను ఏనాడూ కూడ ఏపీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదన్నారు. అందరిలా మోసం చేయబోనని కూడ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏం చేసినా ప్రజలకు చెప్పి వారి ఆమోదంతోనే తాను పనిచేస్తానని ప్రకటించారు.

ఆదివారం గుంటూరులో జరిగిన జనసేన శంఖారావ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.తొలుత జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత  ర్యాలీగా సభా ప్రంగణానికి  పవన్ కళ్యాణ్ చేరుకొన్నారు. 

ప్రత్యేక హోదా కోసం  అన్ని పార్టీలు కలిసి రావాలని కోరితే  వైసీపీ మాత్రం కలిసి రావడం లేదని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. అన్ని పార్టీలు ఏకమై  విభజన సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేద్దాం, ఏపీ ప్రజల ఆత్మగౌరవం విషయంలో ఏకం కావాలని ఆయన సూచించారు. 

ప్రత్యేక హోదాను బీజేపీ నేతలు, ప్రధాని మోడీ మర్చిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబునాయుడు అప్పడప్పుడూ  గజనిలాగా మారుతున్నారని  పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ప్రత్యేక హోదా అనే విషయం బాబుకు ఆరు మాసాలకోసారి గుర్తుకు వస్తోందన్నారు. ప్రత్యేక హోదా అంటూ బాబు  ఆరు మాసాలకోసారి హడావుడి చేస్తారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.

ఈ నెల 29వ తేదీన ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏర్పాటు చేసిన సభకు తాము వెళ్తున్నామని  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి  రావాల్సింది చాలా ఉందని ఆయన చెప్పారు.  ఉద్యోగాలు, పరిశ్రమలు రావాలన్నారు. ఈ విషయాన్ని జగన్ ఎందుకు మర్చిపోయారో చెప్పాలన్నారు. 

ఏపీ ఎన్నికల్లో  ఎవరికి వారుగా  పోటీ చేద్దాం, ఏపీ ప్రజల ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఏకతాటిపైకి వద్దామని ఆయన  పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఏపీ ఆత్మగౌరవం నినదించాల్సిన అవసరం ఉందన్నారు.తనకు జగన్‌ మీద ఎలాంటి కోపతాపాలు లేవన్నారు. ప్రతిపక్ష  పాత్ర సరిగా పోషించనందుకే తాను ఇలా మాట్లాడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఏపీని ఎలా అడ్డగోలుగా విభజించారో  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కూడ నాలుగు ముక్కలుగా విభజించే రోజు వస్తోందని పవన్ కళ్యాణ్  చెప్పారు. రాజకీయ వ్యవస్థకు చంద్రబాబునాయుడు, జగన్ సరిపోరని  పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.  

ఉదయం జనసేన అంటూ రాత్రి పూట టీడీపీ నేతల ఇళ్లలో ఉంటున్నారని.. వారంతా మన చుట్టుపక్కలే ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లాంటి పదవులు లేకుండానే ప్రజల కోసం పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు ప్రజలకు సేవ చేస్తానని ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

ఎట్ హోంలో ఆసక్తికర పరిణామాలు: పవన్‌తో కేసీఆర్, కేటీఆర్ ముచ్చట్లు

 

Follow Us:
Download App:
  • android
  • ios