Asianet News TeluguAsianet News Telugu

రౌడీల తోలు తీస్తా, అవినీతిని కండకండలుగా నరికేస్తా:పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ రౌడీల తోలు తీస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జల్లా మండపేటలో పర్యటిస్తున్న పవన్ రౌడీ యిజంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీలా తమ పార్టీ రౌడీలను పెంచిపోషించదని తోలు తీస్తుందని హెచ్చరించారు. 
 

pawan kalyan fires on corruption
Author
Mandapeta, First Published Nov 23, 2018, 10:36 PM IST

మండపేట: జనసేన పార్టీ రౌడీల తోలు తీస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జల్లా మండపేటలో పర్యటిస్తున్న పవన్ రౌడీ యిజంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీలా తమ పార్టీ రౌడీలను పెంచిపోషించదని తోలు తీస్తుందని హెచ్చరించారు. 

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రౌడీల భరతం పడతానని ఎవరిని వదిలిపెట్టనన్నారు. ప్రతీ ఒక్కరూ తనను అన్నమాటలు గుర్తున్నాయని ప్రతీ మాటకి బదులిస్తానని, ప్రతీ తప్పుడు పనికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకునేలా చేస్తానన్నారు. 

తెలుగుదేశం పాలనలో రౌడీయిజం పెట్రేగిపోతుందన్నారు. తన కార్యకర్తను అకారణంగా అరెస్ట్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వమంటూ పవన్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో అవినీతి అక్రమాలు, రౌడీయిజాలకు పాల్పడుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యడం లేదని నిలదీశారు. 

మహిళలను కొడతారు, జాతిపేరు చెప్పి తిడతారు, కార్యకర్తలను బెదిరిస్తారు, చివరికి మీడియాను కూడా బెదిరిస్తారు అలాంటి రౌడీలను అరెస్ట్ చెయ్యాలంటూ పవన్ సవాల్ విసిరారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమీ చెయ్యలేరన్నారు. 

జనసేనపైనా జనసేన కార్యకర్తలపైనా రౌడీ యిజం చెయ్యాలని చూస్తే తాము ఊరుకోమని ఏం చెయ్యాలో అది చేసి తీరుతామన్నారు. తాము చేతులు కట్టుకుని ముడుచుకోలేదన్నారు. ఇసుక ట్రాక్టర్లతో చంపేస్తామని బెదిస్తారా, లారీలతో గుద్దిస్తారో రండి చూసుకుందామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. కొడుకుపై ప్రేమతో చంద్రబాబు నాయుడు పాలనను వదిలేశారని మండిపడ్డారు. సమీక్షలు, సమావేశాలతోనే సరిపెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర శక్తి లేదని ఏదో అలానెట్టుకొచ్చేస్తున్నారన్నారు.  

చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ లు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేరని చెప్పారు. ఇద్దరు అవినీతి రహిత పాలన అందించలేరన్నారు. కానీ అవినీతితో కూడిన పాలన మాత్రం అందిస్తారంటూ విరుచుకుపడ్డారు. వందల కోట్లు దోచుకునేందుకు రాజకీయాల్లోకి వస్తే తాను మాత్రం వందల కోట్లు సంపాదన వదిలేసి నిస్వార్థంగా ప్రజలకు సేవ చెయ్యలని వచ్చానన్నారు.  

2019 ఎన్నికలు ఎంతో కీలకమన్న పవన్ కళ్యాణ్ సత్తాలేని, సమర్థత లేని లోకేష్ సీఎం కావాలా, శక్తి లేని చంద్రబాబు కావాలా తేల్చుకోవాలన్నారు. చట్ట సభలలో పోరాడాల్సిన వ్యక్తి, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ధైర్యం లేకరోడ్లపై తిరుగుతున్న జగన్ కావాలో తేల్చుకోవాలన్నారు. 

తన దగ్గర డబ్బులు లేవని నీతివంతమైన పాలన అందించే ధైర్యం మనసు ఉందని తనను ఆదరించాలని కోరారు. తాను చంద్రబాబులా 25 కేజీల బియ్యం ఇచ్చి మభ్యపెట్టనని 25 ఏళ్ల భవిష్యత్ ను ఇస్తానన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ స్థానంలో నేనుంటే అలా చేయ్యను తిరగబడతా: పవన్ కళ్యాణ్

రాజకీయాలంటే బుగ్గలు నిమరడం, తల నిమరడం కాదు: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios