Asianet News TeluguAsianet News Telugu

వైసిపి రికార్డు, ఎక్కువ మంది ఎమ్మేల్యేలు కుబేరులే: చంద్రబాబు ఫస్ట్, జగన్ సెకండ్

ఇకపోతే ఆస్తుల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మెుదటి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తి మెుత్తం రూ.668 కోట్లు అని తెలిపింది. ప్రతీ ఏడాది చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.668 కోట్లు అని తెలిపింది. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. 

Majority YCP MLAs are croropatis
Author
Amaravathi, First Published May 29, 2019, 10:31 AM IST

అమరావతి: ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న వైసీపీ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. 

ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలలో అత్యధికశాతం కరోడ్ పతులేనని అసోషియేషన్ ఫర్ డెమోక్రటటిక్ రిపార్మర్స్ సంస్థ ప్రకటింది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఆస్తుల విషయంలోనూ టీడీపీ నేతలను వెనక్కినెట్టారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించడమే కాదు అందులో 94 మంది ఎమ్మెల్యేలు బడా కోటీశ్వరులే కావడం రికార్డుగా ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో 175 మంది శాసనసభ్యులకు గానూ 163మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని తెలిపింది. ఆ 163 మందిలో అత్యధికశాతం మంది వైసీపీకి చెందినవారే కావడం గమనార్హం. ఒక్కో ఎమ్మెల్యే సగటున ఆస్తి రూ.27.87 కోట్లుగా ఉందని ఆ సంస్థ స్పష్టం చేసింది. 

అయితే 12 మంది శాసన సభ్యులు మాత్రం కోటి రూపాయలకు కంటే తక్కువ ఆస్తులు ఉన్నవారు ఉన్నారని తెలిపింది. ఇకపోతే ఆస్తుల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మెుదటి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తి మెుత్తం రూ.668 కోట్లు అని తెలిపింది. 

ప్రతీ ఏడాది చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.668 కోట్లు అని తెలిపింది. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 140 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు కాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన 23 మందిలో 22 మంది కోటీశ్వరులే కావడం విశేషం. అయితే అత్యంత పేద ఎమ్మెల్యేగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ నిలిచారు. 

ఆమె తన ఆస్తులు రూ.6.75 లక్షలుగా ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. ఈమెతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా కోటి రూపాయలు కంటే తక్కువ ఆస్తి ఉన్నవారే. ఇకపోతే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతల ఆస్తి రూ.18.01కోట్లు పెరిగాయి. 

గత ఎన్నికల్లో అభ్యర్థుల ఆస్తి సరాసరి రూ.29.97 కోట్లు కాగా 2019 ఎన్నికలకు వచ్చేసరికి వాటి విలువ రూ.47.99 కోట్లకు చేరిందని ఏడీఆర్ సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కానీ నేతల ఆస్తులు మాత్రం రెట్టింపవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios