Asianet News TeluguAsianet News Telugu

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

వైఎస్ఆర్‌ ఆత్మగా కేవీపీని యాత్ర సినిమాలో చూపారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో వైఎస్ఆర్ తీసుకొన్న ప్రతి నిర్ణయంలో కేవీపీ ఉన్నట్టుగా ఈ సినిమాను చిత్రీకరించారు.

kvp role in yatra cinema
Author
Hyderabad, First Published Feb 8, 2019, 12:37 PM IST

హైదరాబాద్: వైఎస్ఆర్‌ ఆత్మగా కేవీపీని యాత్ర సినిమాలో చూపారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో వైఎస్ఆర్ తీసుకొన్న ప్రతి నిర్ణయంలో కేవీపీ ఉన్నట్టుగా ఈ సినిమాను చిత్రీకరించారు.

వైఎస్ఆర్, కేవీపీ అంటే వేర్వేరు కాదు..  మనుషులుగా ఇద్దరూ వేర్వేరైనా కూడ   మనసుగా   ఒక్కరేనని కాంగ్రెస్ పార్టీలోని  నేతలకు తెలుసు. వైఎస్‌కు కేవీపీని ఆత్మగా కూడ ప్రచారంలో ఉంది. వైఎస్ఆర్ బతికున్నంత కాలం కేవీపీ ఆయనతోనే ఉన్నారు. వైఎస్‌ కూడ కేవీపీ తన ఆత్మ అని కొన్ని ఇంటర్వ్యూల్లో కూడ చెప్పారు.

యాత్ర సినిమాలో కూడ కేవీపీ పాత్రను హెలైట్ చేశారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు పార్టీలో చోటు చేసుకొన్న పరిస్థితులు... ఆ తర్వాత యాత్రలో పరిస్థితుల సమయంలో  వైఎస్ఆర్‌తో  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  జరిపిన చర్చల్లో కూడ కేవీపీ ఉన్నట్టుగా యాత్ర సినిమాలో చూపించారు.

కర్నూల్ జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో  పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే  మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ఆర్‌ను కోరుతోంది. ఈ చర్చల సమయంలో  హై కమాండ్ ప్రతినిధి ముఖాముఖి మాట్లాడుతానని వైఎస్ఆర్‌కు చెబుతారు.

వైఎస్ఆర్, కేవీపీ, హైకమాండ్ ప్రతినిధి మాత్రమే ఉంటారు. అయితే కేవీపీని కూడ బయటకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరపున వచ్చిన ప్రతినిధి కోరుతారు. అయితే మీరు ఒక్కరితోనే మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

మరో వైపు వైఎస్ఆర్ పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో  కాంగ్రెస్  పార్టీ నాయకత్వం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తీసుకొచ్చి వైఎస్ఆర్‌కు చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే  వైఎస్ఆర్ మాత్రం అప్పటికే తయారు చేసిన అభ్యర్థుల జాబితాను కేవీపీతో  కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇ.ప్పించినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

అంతకు ముందు కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెందిన జాతీయ నాయకులతో చర్చల కోసం వైఎస్ఆర్, కేవీపీలు వెళ్తారు.  ఆ సమయంలో చర్చలకు వైఎస్ఆర్‌ను ఒక్కరినే లోపలికి రావాలని  నాయకత్వం కబురు పెడుతోంది. 

పదవి కావాలంటే ఒక్కరినే రావాలని  కాంగ్రెస్ నాయకత్వం వైఎస్ఆర్‌కు  సూచిస్తోంది.  అయితే  ఈ విషయమై కాంగ్రెస్  పార్టీ నాయకత్వంతో సమావేశానికి వెళ్లకుండానే వైఎస్ఆర్ వెనుతిరిగినట్టుగా సినిమాలో చూపించారు.

ఎన్నికల సమయంలో  తొందరపడకూడదంటూ  కేవీపీ సూచించినా కూడ వైఎస్ఆర్  కాంగ్రెస్ నేతలతో చర్చలకు వెళ్లకుండా వెను తిరుగుతారు. వైఎస్ఆర్ బతికున్నంత కాలం కేవీపీ ఆయనతోనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

 

Follow Us:
Download App:
  • android
  • ios