Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో బాబు వ్యూహమిదీ: టీడీపీలోకి కొమ్మి లక్ష్మయ్యనాయుడు

నెల్లూరు జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు. 

kommi laxmaiah naidu likely to join in tdp soon
Author
Nellore, First Published Dec 23, 2018, 3:48 PM IST

అమరావతి: నెల్లూరు జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు. విపక్ష పార్టీల్లోని  బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడంతో  జిల్లా పరిషత్ ఛైర్మెన్ కు టీడీపీ గాలం వేసింది.  తాజాగా  ఆత్మకూర్ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు టీడీపీలో చేరేందుకు  రంగం సిద్దం  చేసుకొన్నారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీని దెబ్బతీసేందుకుగాను చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.రానున్న ఎన్నికల్లో  ఈ జిల్లా నుండి వైసీపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొనేలా  బాబు ప్లాన్ చేస్తున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు గాలం వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  కొమ్మి లక్ష్మయ్య నాయుడు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు బాబుతో చర్చించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో  టీడీపీని బలోపేతం చేసేందుకు  లక్ష్మయ్య నాయుడును  పార్టీలో చేర్చుకొనేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

టీడీపీ చేరేందుకు లక్ష్మయ్యనాయుడు కూడ సానుకూలంగా ఉన్నారు. తన అనుచరులతో  చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు లక్ష్మయ్య నాయుడు చెబుతున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ లు లక్ష్మయ్యనాయుడును  చంద్రబాబునాయుడు వద్దకు తీసుకొచ్చారు.

బాబుతో చర్చల  పట్ల లక్ష్మయ్య నాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే లక్ష్మయ్య నాయుడు  ఎప్పుడు పార్టీలో చేరుతారనేది  ఇంకా స్పష్టం చేయలేదు. అనుచరులతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని లక్ష్మయ్య నాయుడు ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం: కేంద్రంపై బాబు

నాకు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్, భయపడను: బాబు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్

 

Follow Us:
Download App:
  • android
  • ios