Asianet News TeluguAsianet News Telugu

కేఈతో ఇబ్బందేమీ లేదు, కలిసి పని చేస్తా: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

కోట్ల కుటుంబంతో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను కేఈ కృష్ణమూర్తితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలోనూ కేఈతో కలిసి పనిచేశామని భవిష్యత్ లో కూడా పనిచేస్తానన్నారు. కేఈ కుటుంబంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

k.e.krishna murthy and me Work together says kotla suryaprakash reddy
Author
Kurnool, First Published Feb 23, 2019, 7:45 AM IST

కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీలో నెలకొన్న వర్గపోరుకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్లైంది. తెలుగుదేశం పార్టీలో చేరకముందే కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆ పార్టీలో పరోక్షంగా చిచ్చు రేపారు. 

కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరికపై కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చంద్రబాబు తనను అడగలేదని బాహాటంగానే చెప్పుకొచ్చారు. 

పరోక్షంగా వారి రాకను వ్యతిరేకించారు. అయితే శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు బుజ్జగింపులతో అలకవీడారు కేఈ కృష్ణమూర్తి. కోట్ల కుటుంబంతో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను కేఈ కృష్ణమూర్తితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలోనూ కేఈతో కలిసి పనిచేశామని భవిష్యత్ లో కూడా పనిచేస్తానన్నారు. 

కేఈ కుటుంబంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సీట్లు విషయంపై తాను చంద్రబాబుతో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను మూడు సీట్లు కోరలేదని అయినా ఒకే  కుటుంబం నుంచి మూడు సీట్లు కోరడం భావ్యం కాదన్నారు. ఈనెల 28న తాము తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో తాను కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చెయ్యనున్నట్లు కోట్ల స్పష్టం చేశారు. గండ్రేవుల ప్రాజెక్టు, తుంగభద్ర దిగువ కాల్వపైపులైన్ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చెయ్యడం పట్ల కోట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

దశాబ్ధాల కల నెరవేరినందుకు జిల్లా రైతుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 28న కోడుమూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభ సాక్షిగా తాము టీడీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. 

ఆ సభ వేదిగా మూడు సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రైతులు బ్రహ్మరథం పడతారని కేంద్ర మాజీమంత్రి కోట్లు సూర్యప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కర్నూలులో చంద్రబాబు వ్యూహం: రాజీకొచ్చిన కేఈ, కోట్ల కుటుంబాలు

Follow Us:
Download App:
  • android
  • ios