Asianet News TeluguAsianet News Telugu

జనసేన లాంగ్ మార్చ్: ఏయూ గేట్ల మూసివేత, విశాఖలో ఉద్రిక్తత

విశాఖపట్టణంలో జనసేన కార్యకర్తల లాంగ్ మార్చ్ సందర్భంగా ఆదివారం నాడు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకొన్నాయి.

Janasena long march:Tension prevails at Andhra University in visakapatnam district
Author
Visakhapatnam, First Published Nov 3, 2019, 1:36 PM IST


విశాఖపట్టణం: విశాఖపట్టణంలో ఆదివారం నాడు మధ్యాహ్పం ఉద్రిక్తత చోటు చేసుకొంది. మద్దెలపాలెం వైపుకు వెళ్లే దారిలో ఏయూ గేట్లను మూసివేశారు. పోలీసులు.దీంతో ఏయూ గేట్లను తోసుకొని జనసేన కార్యకర్తలు మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది.

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది జనసేన కార్యకర్తలు ఆదివారం నాడు విశాఖకు చేరుకొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు.

READ  MORE  లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలతో పాటు సామాన్యులను కూడ పోకుండా అడ్డుకొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనసేనకు సంబంధం లేని వారిని ఆ దారిలో పనులు చూసుకొనేందుకు వెళ్లేవారిని అనుమతించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

మరోవైపు మద్దెలపాలెం వైపుకు వెళ్లకుండా జనసేన కార్యకర్తలను అడ్డుకోవడంతో ఆంధ్రాయూనివర్శిటీ గేట్లను ఎక్కి లోపలికి వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు.ఈ సమయంలో గేట్ల వద్ద పోలీసులు జనసేన కార్యకర్తలను అడ్డుకొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.

READ MORE  ''చంద్రబాబు డైరెక్షన్ లోనే పిల్లసేన లాంగ్ మార్చ్...పవన్ కు రెమ్యునరేషన్...''

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో జనసేనతో పాటు టీడీపీ కూడ పాల్గొంటుంది.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు భవన నిర్మాణకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

దీంతో భవన నిర్మాణకార్మికుల పనులు కల్పించేలా ఇసుక కొరతను నివారించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు.

లాంగ్ మార్చ్ లో 13 జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 

శనివారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లాంగ్ మార్చ్ కి అన్ని వర్గాల మద్దతు కోరుతూ పవన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేయడం,  భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అందువల్లే జనసేన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టాల్సి వచ్చిందని...అందుకోసమే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios