Asianet News TeluguAsianet News Telugu

అందుకే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చా: పవన్

కుల రాజకీయాలు వస్తే భవిష్యత్ తరానికి ఇబ్బందులని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  చెప్పారు

janasena chief pawan kalyan slams on tdp chief chandrababunaidu
Author
Vijayawada, First Published Dec 1, 2018, 12:24 PM IST

విజయవాడ: కుల రాజకీయాలు వస్తే భవిష్యత్ తరానికి ఇబ్బందులని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  చెప్పారు. 

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం నాడు విజయవాడలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో  టీడీపీని వీడీ జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ఒక్కొక్క పార్టీ ఒక్కో కులాన్ని పెంచి పోషిస్తే కుల రాజకీయాలు వస్తే ఇబ్బంది పడుతాయని భావించినట్టు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.యూపీ, ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రాల తరహలో అశాంతికి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  తాను 2014 ఎన్నికల సమయంలో  టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. 

అవినీతి రహిత పాలన వస్తోందని చంద్రబాబునాయుడు అందిస్తారని భావించానని చెప్పారు.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు మాత్రం పాలనలో  ఆ తరహ చేయలేదన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  శాంతి భద్రతలను కాపాడుతారనే ఎన్టీఆర్, చంద్రబాబునాయుడుకు గతంలో పేరుండేదన్నారు.ఈ దఫా చంద్రబాబునాయుడు పాలన  మాత్రం అందుకు విరుద్దంగా ఉందన్నారు.  ప్రజలకు సేవ చేసే  రాజకీయ వ్యవస్థ అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కుల రాజకీయాలు వస్తే భవిష్యత్ తరానికి ఇబ్బందులని పవన్ కళ్యాణ్  చెప్పారు. 

సంబంధిత వార్తలు

బాబుకు షాక్: జనసేనలో చేరిన రావెల కిషోర్ బాబు

చంద్రబాబుకు ఝలక్: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా

Follow Us:
Download App:
  • android
  • ios