Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఎఫెక్ట్: అందుకే చంద్రబాబు ఆ హామీ

తాము అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతువుల పెనన్షనను రూ. 2000కు పెంచుతామని జగన్ 2017 జులై 8వ తేదీిన గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ప్రకటించారు. 

Jagan effect: Chnadrababu hikes pension amount
Author
Amaravathi, First Published Jan 12, 2019, 11:52 AM IST

అమరావతి: ఫించన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన వెనక వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవరత్నాల ప్రభావం ఉందనే చర్చ సాగుతోంది. పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 

నెల్లూరు జిల్లా జన్మభూమి ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతువుల పెనన్షనను రూ. 2000కు పెంచుతామని జగన్ 2017 జులై 8వ తేదీిన గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ప్రకటించారు. 

ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు పెన్షన్లను రెట్టింపు చేస్తామని, అది ఈ నెల నుంచే అమలవుతుందని ప్రకటించినట్లు భావిస్తున్నారు. జగన్ ఇచ్చిన ఇతర హామీలపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా జగన్ ఇచ్చిన హామీలను తలదన్నే హామీలను ఇవ్వాలని ఆయన చూస్తున్నట్లు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios