Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ మద్యం ఐడియా అదిరిపోయింది

జూలైలో చేయబోయే లైసెన్స్ రెన్యువల్ ను ఏకంగా 2022 వరకూ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ టిడిపి అధికారంలోకి రాకపోయినా నేతలకు మాత్రం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ పద్దతి ఒక్క మద్యం షాపులకే కాదు బార్లకు కూడా వర్తింపచేస్తారట. అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ పద్దతిని మార్చాలని అనుకున్నా టిడిపి నేతలు కోర్టుకు వెళితే స్టే రావటం ఖాయం.

Is govt creating permanent income source to tdp leaders

రాజకీయనేతలకు, వ్యాపారస్తులకు అనేక ఆదాయమార్గాలుంటాయి. అటువంటి ఆదాయమార్గాల్లో మద్యం వ్యాపారం ఒకటి. ఈ వ్యాపారం ఎప్పటికీ నష్టాలు రాని కల్పవృక్షం లాంటిది. తాజాగా అటువంటి వ్యాపారాన్ని తమ నేతలకు శాస్వత ఆదాయమార్గంగా చేయాలని చంద్రబాబునాయుడు అనుకున్నట్లున్నారు. అందుకే నిబంధనలు సైతం మార్చేస్తున్నారు. అందుకు తగ్గట్లే తమ్ముళ్ళు కూడా మద్యం వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు చాలామంది.

మళ్ళీ ఇందులో కూడా అక్రమం, సక్రమం రెండు రకాలు. అక్రమానికి ఆకాశమే హద్దనుకోండి. సక్రమం అన్నపుడు ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే ఎక్కువ అవకాశాలు. ప్రస్తుతం ఎక్కువమంది టిడిపి నేతల సంపాదనకు మద్యం వ్యాపారమే సిరులు పండిస్తోంది. మరి, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కకపోతే? అందుకే ప్రభుత్వంలోని ముఖ్యులు ఓ మార్గం కనిపెట్టారు. అదేంటంటే ఇప్పటి వరకూ మద్యం లైసెన్సులను ఏడాదికో, రెండోళ్ళకోసారో రెన్యువల్ చేస్తుంది ప్రభుత్వం. ఎన్నికలేమో రెండేళ్ళలో వస్తోంది. మళ్ళీ టిడిపినే అథికారంలోకి వస్తే మంచిదే. ఒకవేళ అధికారంలోకి రాకపోతే?

ఇక్కడే ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించినట్లుంది. ఏడాది, రెండేళ్ళ రెన్యువల్ విధానానికి స్వస్తి పలికి ఒకేసారి ఐదేళ్ళు లైసెన్సులను మంజూరు చేయాలని నిర్ణయించింది. మామూలుగా లైసెన్స్ రెన్యువల్ జూలై మాసంలో చేస్తుంటారు.  అంటే 2018లో అయిపోయే లైసెన్సును మామూలుగా అయితే 2019లో రెన్యువల్ చేయాలి. 2019లో ఎన్నికల షెడ్యూల్ మే నెలలోనే. అంటే మేనెలలో జరిగే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే? నేతల మద్యం ఆదాయం దెబ్బతింటుంది.

అందుకనే ఈ జూలైలో చేయబోయే లైసెన్స్ రెన్యువల్ ను ఏకంగా 2022 వరకూ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ టిడిపి అధికారంలోకి రాకపోయినా నేతలకు మాత్రం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ పద్దతి ఒక్క మద్యం షాపులకే కాదు బార్లకు కూడా వర్తింపచేస్తారట. అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ పద్దతిని మార్చాలని అనుకున్నా టిడిపి నేతలు కోర్టుకు వెళితే స్టే రావటం ఖాయం. కాబట్టి తమ వాళ్ళ ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదన్నది ముఖ్యుల ఆలోచన. ఎలాగుంది ఐడియా..అద్దిరిపోలా ?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios