Asianet News TeluguAsianet News Telugu

కచ్చులూరు బోటు ప్రమాదం: ప్రైవేట్ వ్యక్తి చేతికి బోటు వెలికితీత పనులు

నేవీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం సైతం బోటు వెలికితీసేందుకు ఎంతగానో ప్రయత్నించాయి. అయితే ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించింది. ‘‘ఆపరేషన్ రాయల్ వశిష్ట పేరు’’తో బోటు వెలికితీతకు రూ.22.70 లక్షల వర్క్ ఆర్డర్ ఇచ్చింది. 

Godavari Boat accident: work order for to pulling out boat
Author
Devipatnam, First Published Sep 29, 2019, 10:56 AM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం జరిగి 20 రోజులు గడుస్తున్నా గల్లంతైన బోటు మాత్రం ఇంతవరకు దొరకలేదు.

గోదావరి అత్యంత లోతుగా ఉండే ప్రాంతం కావడంతో పాటు నదీలో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్య్కూ సిబ్బంది అంచనా ప్రకారం నదీగర్భంలో సుమారు 250 నుంచి 300 అడుగుల లోతులో బోటు ఉండవచ్చని భావిస్తున్నారు.

నేవీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం సైతం బోటు వెలికితీసేందుకు ఎంతగానో ప్రయత్నించాయి.

అయితే ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించింది. ‘‘ఆపరేషన్ రాయల్ వశిష్ట పేరు’’తో బోటు వెలికితీతకు రూ.22.70 లక్షల వర్క్ ఆర్డర్ ఇచ్చింది.

ఈ క్రమంలో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం పనులు దక్కించుకున్నాడు.  ఈ ఆపరేషన్‌లో పాల్గొనే వారందరికీ రిస్క్ కవరేజ్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా.. ఇప్పటి వరకు 36 మృతదేహాలు బయటపడగా.. ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బోటులోని ఏసీ క్యాబిన్‌లో వీరంతా మృత్యువాత పడివుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు:

బోటు మునక: ప్రజలను రక్షించిన కచ్చులూరు వాసులకు జగన్ నజరానా

బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

బోటు ప్రమాద నిందితుల అరెస్ట్: ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios