Asianet News TeluguAsianet News Telugu

అనర్హత భయంతోనే... జగన్‌పై అభిమానంతో కాదు: వంశీ చేరికపై యార్లగడ్డ నిప్పులు

అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వంశీ వైసీపీలో చేరుతున్నారంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం లేదని పలువురు కార్యకర్తలు చెప్పారని ఈ విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేస్తానని యార్లగడ్డ వెల్లడించారు.

gannavaram ysrcp incharge yarlagadda venkata rao makes comments on tdp MLA vallabhaneni vamsi
Author
Vijayawada, First Published Oct 27, 2019, 1:24 PM IST

తనను కలిసేందుకు.. తన నిర్ణయం తెలుసుకునేందుకు కార్యకర్తలు, అనుచరులు తరలివస్తుండటంతో తానే సమావేశాన్ని ఏర్పాటు చేశానన్నారు కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో గన్నవరం రాజకీయాలు హిటెక్కాయి.

ఈ క్రమంలో వల్లభనేని, యార్లగడ్డ ఇద్దరు కార్యకర్తలతో విడివిడిగా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని.. కార్యకర్తల మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వంశీ వైసీపీలో చేరుతున్నారంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం లేదని పలువురు కార్యకర్తలు చెప్పారని ఈ విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేస్తానని యార్లగడ్డ వెల్లడించారు.

పదేళ్లు పార్టీ జెండా పట్టుకుని మోసినప్పుడు ఎవరిపై పోరాటం చేశామో, ఎవరైతే ఇబ్బందులకు గురిచేశారో వారిని పార్టీలోకి చేర్చుకోవడం సరికాదంటున్నారు. అదే సమయంలో బాలవర్థనరావు లాంటి నిజాయితీ గల వ్యక్తి పార్టీలో చేరితే స్వాగతించిన విషయాన్ని వెంకట్రావు గుర్తు చేశారు.

Also Read:హాట్ టాపిక్‌గా గన్నవరం రాజకీయాలు: కార్యకర్తలతో వంశీ, యార్లగడ్డ భేటీ

కలలో కూడా జగన్ తనకు అన్యాయం చేయరనే తాను భావిస్తున్నానని.. తనకు మద్ధతుగా మూడు మండలాల కన్వీనర్లు రాజీనామా చేస్తానంటే తాను వద్దని వారించానని యార్లగడ్డ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వంశీ ఇళ్లపట్టాలు పంచారని అందువల్ల వల్లభనేనిపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని వెంకట్రావు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాలని వంశీకి కండిషన్ పెట్టాడు. వంశీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్టు నిన్న రాత్రి నుంచే వార్తలు వస్తున్నాయి. 

వంశీ రాజీనామాతో ఖాళీ అయ్యే గన్నవరం సీటును యార్లగడ్డకు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇరువురినీ కూడా జగన్ ఒప్పించారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందాడు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే గన్నవరం నుండి మరో మారు యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగనున్నారు. 

Also Read:వల్లభనేని వంశీపై చంద్రబాబు ఆగ్రహం: తడాఖా చూపాలని దేవినేని ఉమకు ఆదేశం

వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జగన్ వంశీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వంశీ జగన్ ను కలుస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుక్షణం యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారంనాడు యార్లగడ్డ నివాసానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

వంశీని వైఎస్సార్ కాంగ్రెసులో చేర్చుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని  ఆందోళన చెందుతున్న యార్లగడ్డ  మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ తో వంశీ అరగంట పాటు సమావేశమయ్యారు. 

Also Read:చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు

వంశీ జగన్ ను కలవడానికి ముందు బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కూడా కలిశారు. అయితే, సుజనా చౌదరిని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి వంశీ వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీపై ఇటీవల కేసు నమోదైంది. నకిలీ పట్టాలు ఇచ్చారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios