Asianet News TeluguAsianet News Telugu

స్విస్ ఛాలెంజ్ పై కేసు: చంద్రబాబుకు షాక్

  • ప్రభుత్వం సిద్ధం చేసిన ఒప్పందంలో సింగపూర్ సంస్ధలకు మాత్రమే ఉపయోగమని ఐవైఆర్ తన పిటీషన్లో పేర్కొన్నారు.
Former CS iyr files case against Swiss challenge in the high court

చంద్రబాబునాయుడు మక్కువ చూపుతున్న ‘స్విస్ ఛాలెంజ్’ విధానంపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో కేసు వేశారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించాలని అనుకోవటం సుప్రింకోర్టు మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమన్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ఒప్పందంలో సింగపూర్ సంస్ధలకు మాత్రమే ఉపయోగమని ఐవైఆర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. కాబట్టి స్విస్ ఛాలెంజ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 179ని నిలుపుదల చేయాంటూ విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే స్విస్ ఛలెంజ్ పద్దతిపై అనేక కేసులున్నాయి హై కోర్టులో. కొన్ని కేసుల్లో కోర్టు ప్రభుత్వానికి నొటీసులు కూడా జారీ చేసింది. చెన్నై బిల్డర్ వేసిన ఓ కేసులో స్విస్ ఛాలెంజ్ విధానం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం కూడా చేసింది. అయినా ప్రభుత్వం తన పద్దతిని మార్చుకోవటానికి ఇష్టపడలేదు. దాంతోనే వివాదాలు పెరిగిపోతున్నాయి. ఆ నేపధ్యంలోనే ఐవైఆర్ కూడా తాజాగా కేసు వేశారు.

సింగపూర్ కు చెందిన అసెండాస్-సింగ్ బ్రిడ్జ్-సెంబ్ కార్ప్ ప్ర్రైవేటు సంస్ధల కన్సార్షియం సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం అనుసరించాలని నిర్ణయించటం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఐవైఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కన్సార్షియంతో సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలన్నీ నియమాలను ఉల్లంఘించి చేసుకున్నవే అంటూ తన పిటీషన్లో స్పష్టం చేశారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానమే మంచిదన్నారు. కాబట్టి ఓపెన్ బిడ్డింగ్ విధానాన్నే అనుసరించాలని ప్రభుత్వాన్ని ఆదేధశించాలని ఐవైఆర్ కోర్టును కోరారు. జీవో 179 ద్వారా జరిగిన ఒప్పందాలపై ఎలాంటి పనులు మొదలుపెట్టకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని, మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ కృష్ణారావు కోర్టును అభ్యర్ధించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమేనని కూడా ఐవైఆర్ తన పిటీషనోలో పేర్కొన్నారు. తన వాదనకు అవసరమైన అన్నీ డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. మరి కోర్టు ఏం చేస్తుందో చూడాలి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios