Asianet News TeluguAsianet News Telugu

వెంటాడుతున్న కేసులు: మరో కేసులో చింతమనేని రిమాండ్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత  చింతమనేని ప్రభాకర్ ను కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసుల నుండి ఆయన తప్పించుకోలేకపోతున్నారు. జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను జోసెఫ్ ను బెదిరించిన కేసులో పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

Dendulur Former MLA Chintamaneni Prabhakar Arrested, Remand to OCt 28
Author
Eluru, First Published Oct 23, 2019, 4:08 PM IST

ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై  జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పాత కేసులన్నీ చింతమనేని ప్రభాకర్‌ను వెంటాడుతున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుండి ఆయనను ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉంచారు.

చింతమనేని ప్రభాకర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే పాత కేసుల్లో పీటీ వారంట్ పై అరెస్ట్ చూపిస్తున్నారు పోలీసులు.  ఇందులో భాగంగానే ఇప్పటికే 13 కేసుల్లో పిటీ వారంట్‌పై చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చూపించారు.

పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన  చెరుకు జోసెఫ్‌ను ఈ ఏడాది ఆగష్టు 28వ తేదీన చింతమనేని ప్రభాకర్‌, మరికొందరు  దాడి చేసి కులం పేరుతో దూషించారనే కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే అతడిని అతడి కుటుంబ సబ్యుల అంతు చూస్తామని చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడినట్టుగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జోసెఫ్ ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు మేరకు  ఏలూరు త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రిమాండ్‌ ఖైదీగా జిల్లా జైలులో ఉండడంతో పీటీ వారెంట్‌పై ఈ కేసులో మంగళవారం అరెస్టు చూపించారు. 

జిల్లా జైలు నుంచి ఏలూరులోని సెకండ్‌ ఏజెఎఫ్‌సీఎం కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ ఆదేశాల మేరకు త్రీ టౌన్‌ పోలీసులు పటిష్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరుపర్చారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దెందులూరు అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ కూడ ఓటమి పాలయ్యాడు.

చింతమనేని ప్రభాకర్ ఓటమి చెందగానే ఆయనపై ఉన్న పాత కేసులు తిరగతోడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కేసుల్లో జిల్లా జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్‌  తనను బెదిరించాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఫోన్‌లో తనను బెదిరించాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఫోన్ లో జోసెఫ్ ను ఎలా బెదిరించాడని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కీలకమైన టీడీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులపై  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై నమోదైన కేసుల గురించి టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

also read చింతమనేనికి చుక్కలే చుక్కలు: మరో కేసు నమోదు ...

also read మరోసారి చింతమనేని అరెస్ట్...ఇది మరో కేసు ...

Follow Us:
Download App:
  • android
  • ios