Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై పురంధీశ్వరి భర్త సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జీవితచరిత్రపై ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం కథానాయకుడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఇక ఆంధప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీనటుడు బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 
 

Daggubati Venkateswar Rao comments on NTR biopic
Author
Hyderabad, First Published Jan 5, 2019, 3:52 PM IST

హైదరాబాద్: ఎన్టీఆర్ జీవితచరిత్రపై ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం కథానాయకుడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఇక ఆంధప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీనటుడు బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

కథానాయకుడు చిత్రం తెలుగుదేశం పార్టీకి మైలేజ్ తీసుకువస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ లో దారుణమైన ఘటన వైశ్రాయ్ ఘటన. ఆనాడు ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దింపడానికి జరిగిన పన్నాగానికి వేదిక వైశ్రాయ్ హోటల్. అయితే ఆ ఘటనను సినిమాలో ఎలా తెరకెక్కిస్తారు అనేది ప్రధానంగా ఆసక్తి నెలకొంది. 

ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో అయితే సినీనటుడు బాలకృష్ణ అన్న నందమూరి తారక రామారావు గెటప్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నందమూరి కుటుంబీకులను, ఎన్టీఆర్ సన్నిహితులను తీసుకువచ్చి హల్ చల్ చేశారు బాలయ్య.

అయితే కథానాయకుడు సినిమాపై ప్రముఖ రాజకీయ వేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైశ్రాయ్ హోటల్ ఘటనకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను గుట్టు రట్టు చేశారు. కథానాయకుడు చిత్రంలో బాలకృష్ణ పాత్రను ఎలా చూపిస్తారా అంటూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చర్చించారు. 

ఆనాడు ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చెయ్యడానికి బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబు నాయుడు తన ఇంటికి వచ్చారని తెలిపారు. ఢిల్లీలో ఉన్న తాను హైదరాబాద్ వచ్చేసరికి గంట ముందే ఈ ముగ్గురు తన ఇంటికి వచ్చారని చెప్పారు. 

తాను ఇంటికి వచ్చిన తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబు నాయుడు ముగ్గురు తమకు మద్దతు ఇచ్చేందుకు వైశ్రాయ్ హోటల్ కి రావాలంటూ కోరారని తెలిపారు. బాలకృష్ణ ఆనాడు చేసిన ప్రయత్నాన్ని సినిమాలో ఎలా చూపిస్తారో మరి అన్నారు. 

ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసిన ఘటనలో ఆ నిందను ఎవరికి ఆపాదిస్తారో చూడాలని అయితే ఆ సీన్ లో బాలయ్య ఉన్నాడని తాను చెప్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు పదవులపై తనతో రహస్యంగా మాట్లాడారని గుర్తు చేశారు.  

టీడీపీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని తనను డిప్యూటీ సీఎం చేస్తారని హామీ ఇచ్చారని మరి హరికృష్ణ  పరిస్థితిపై అడిగితే పార్టీ సెక్రటరీ పదవి ఇద్దామని అలా తిరుగుతాడు అంటూ చెప్పుకొచ్చారని తెలిపారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

బాలయ్యకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దెబ్బ

బ్రేకింగ్: ఎన్టీఆర్ ‘కథానాయకుడు’కు స్పెషల్ షో లు లేవు

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

 

Follow Us:
Download App:
  • android
  • ios