Asianet News TeluguAsianet News Telugu

దూసుకొస్తున్న హికా తుపాను... తెలుగు రాష్ట్రాలకు ముప్పు

నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖాధికారులు తెలిపారు. 85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో... చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. 

Cyclone Hikka: Direct Effects Over, Rain Expected In Some Parts, Says Oman Authority
Author
Hyderabad, First Published Sep 26, 2019, 10:06 AM IST


గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు హికా ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 'హికా' తుపాను దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావం పలు రాష్ట్రాలపై ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖాధికారులు తెలిపారు. 85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో... చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల.. చెరువులు తెగి, పంటలు నీట మునిగి, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios