Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై జోష్: 9న కుమారస్వామితో బాబు భేటీ

కర్ణాటక సీఎం కుమారస్వామికి, మాజీ ప్రధాని దేవేగౌడ‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఫోన్ చేశారు

chandrababu naidu to meet karnataka cm kumara swamy on nov 9
Author
Amaravathi, First Published Nov 6, 2018, 5:58 PM IST


అమరావతి: కర్ణాటక సీఎం కుమారస్వామికి, మాజీ ప్రధాని దేవేగౌడ‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఫోన్ చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ -జేడీఎస్ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల  బాబు అభినందించారు.

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ -జేడీఎస్ కూటమి భారీ విజయం సాధించడం పట్ల  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కర్ణాటక సీఎం కుమారస్వామికి ఫోన్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బతీసినందుకు ఆయన అభినందల్లో ముంచెత్తారు.

ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే  ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందని బాబు ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రకటించారు.

నవంబర్ 9 తేదీన బెంగుళూరులో కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కానున్నారు.  జాతీయస్థాయిలో బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించనున్నారు. పలు పార్టీల జాతీయ నేతలతో కూడ చంద్రబాబునాయుడు  వరుసభేటీలు నిర్వహించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

సంబంధిత వార్లలు

గతాన్ని వదిలేసి పనిచేస్తాం: బాబుతో కలిసి రాహుల్

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios