Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో టీఆర్ఎస్‌ డిమాండ్ చేసిందని, ఎన్నికల సమయంలో  ఆ పార్టీ ఎందుకు యూ టర్న్  తీసుకొందో చెప్పాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు

Chandrababu naidu satirical comments trs and ysrcp
Author
Amaravathi, First Published Dec 23, 2018, 12:05 PM IST


హైదరాబాద్:ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో టీఆర్ఎస్‌ డిమాండ్ చేసిందని, ఎన్నికల సమయంలో  ఆ పార్టీ ఎందుకు యూ టర్న్  తీసుకొందో చెప్పాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న టీఆర్ఎస్‌కు  వైసీపీ ఎలా మద్దతిస్తోందో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు అమరావతిలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై శ్వేత పత్రాలను విడుదల చేశారు. గతంలో  ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వాలని కవిత, కేసీఆర్‌లు ప్రకటించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడ  ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  యూ టర్న్  తీసుకొందని చంద్రబాబునాయుడు చెప్పారు. తెలంగాణలో  టీఆర్ఎస్‌కు  వైసీపీ మద్దతిచ్చిందన్నారు. తెలంగాణలో  టీఆర్ఎస్ విజయం సాధిస్తే  ఏపీలో  సంబరాలు నిర్వహించుకొన్నారని  బాబు  గుర్తు చేశారు.

తెలంగాణలో  టీఆర్ఎస్‌ విజయం సాధిస్తే వాళ్లు విజయం సాధించినట్టు, తాను ఓడిపోయినట్టుగా  భావించి సంబరాలు చేసుకొన్నారని పరోక్షంగా వైసీపీ నేతలపై బాబు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు తాను ఏనాడూ కూడ వ్యతిరేకంగా మాట్లాడలేదని బాబు మరోసారి స్పష్టం చేశారు. 

రెండు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు సాగాలనేది తన అభిమతంగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని  డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్‌తో  వైసీపీ నేతలు అంటకాగుతున్నారని బాబు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని  చెప్పిన పార్టీకి మద్దతిచ్చిన  వైసీపీ కూడ  ఏపీకి అన్యాయం చేసేందుకు  ప్రయత్నిస్తోందని  బాబు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం: కేంద్రంపై బాబు

నాకు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్, భయపడను: బాబు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్

 

Follow Us:
Download App:
  • android
  • ios