Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో వాళ్లు చేస్తేనే సాక్ష్యాలు తుడిచేస్తారు: వివేకా హత్యపై జగన్ మీద బాబు ఎదురుదాడి

వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలుస్తున్నప్పటికీ ఎందుకు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నించారని ఆరోపించారు. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి కూడా గుండెపోటుగా ఎందుకు నమ్మించే ప్రయత్నాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 

chandrababu naidu comments on ys vivekanandareddy murder
Author
Amaravathi, First Published Mar 15, 2019, 9:49 PM IST

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్త చాలా బాధకలిగించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానందరెడ్డిది మెుదట గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసింది వైఎస్ కుటుంబమేనని చెప్పుకొచ్చారు.  ప్రజలు వచ్చేసరికి దాన్ని హత్య అంటూ చెప్పుకొచ్చారని అప్పటికే సాక్ష్యాలను రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారని ఆరోపించారు.  

వైఎస్ వివేకానందరెడ్డి బాత్ రూమ్ లో పడిచనిపోయారని ఉదయం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ప్రజలు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ఉండాలని కోరారని తెలిపారు. 

వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలుస్తున్నప్పటికీ ఎందుకు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నించారని ఆరోపించారు. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి కూడా గుండెపోటుగా ఎందుకు నమ్మించే ప్రయత్నాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

సీఐ పోలీసు బృందంతో వెళ్లేసరికి రక్తపు మరకలు ఎందుకు తుడిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నా దాన్ని హార్ట్ ఎటాక్ గా ఎందుకు సృష్టించాల్సి వచ్చిందో తెలిపాలని ప్రశ్నించారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉదయం 5.30గంటలకు పీఏ చూశాడని ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ఉదయం 6.45గంటలకు పోలీసులకు ఫోన్ చేశారని ఎవరు అవినాష్ రెడ్డికి చెప్పారో తెలియాల్సి ఉందన్నారు. 

గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి, హత్య గావించబడిన వ్యక్తికి తేడాలు తెలియడం లేదా అని నిలదీశారు. హత్యకు సంబంధించి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చెయ్యాలో చెప్పాలని ప్రయత్నించారు. 

హత్యను కప్పి పుచ్చి తనపైనా తెలుగుదేశం పార్టీపైనా, తనపైనా, తన కుమారుడు లోకేష్ పైనా నిందలు మోపుతారా అంటూ ప్రశ్నించారు. గత రాత్రి ఏం జరిగింది, తెల్లవారు జామున హత్యకు సంబంధించి  ఎవరెవరు ఫోన్లు చేశారో విచారణలో తెలియాల్సి ఉందన్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఫారెన్సిక్ అవిడెన్స్ ని నాశనం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కుటుంబం సభ్యులే హత్య చేసి ఉంటారు కాబట్టే సాక్ష్యాలను తారుమారు చేశారా అని నిలదీశారు. 

లేకపోతే బయటవారు హత్య చేస్తే సాక్ష్యాలను ఎందుకు నాశనం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బయట వ్యక్తులు హత్య చేస్తే వాళ్లని కాపాడేందుకే రక్తపు మరకలను సాక్ష్యాలను తారుమారు చేశారా అంటూ ప్రశ్నించారు. 

కుటుంబ సభ్యుడు హత్యకు గురైతే ఆ హత్యను కప్పిపుచ్చేలా సాక్ష్యాలను తారుమారు చేసేలా క్రియేట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. హత్య అని తేలాకే తమపై ఆ నిందను మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉదయం లేని లేఖ సాయంత్రానికి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రజలకు వివరించాలని కోరారు. 

తొలుత కేసులు అవసరం లేదని చెప్పింది మీరే ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తారా అంటూ నిలదీశారు. హత్య కేసుపై సమగ్రదర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంతా మిస్టీరియస్ గా ఉందన్నారు. పోస్టుమార్టంలో హత్య అని తేలేంత వరకు గుండెపోటు అని చెప్పుకొచ్చారని ఆ తర్వాతే స్వరం మార్చారని చంద్రబాబు తెలిపారు. వాస్తవాలు దాచి తమపై నిందలు మోపుతారా అంటూ ప్రశ్నించారు. 

వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసి ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు తప్పుమీద తప్పు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనేది తొందరలోనే తెలుస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

నా తండ్రిని ప్రత్యర్థులే హత్య చేశారు:వైఎస్ వివేకా హత్యపై కుమార్తె సునీత ఫిర్యాదు

తలపై గొడ్డలితో నరికి చంపారు, డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం : సిట్ దర్యాప్తుపై జగన్ ఫైర్

మా కుటుంబంలో జరిగిన ప్రతీ హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉంది: వైఎస్ జగన్

చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి

 

Follow Us:
Download App:
  • android
  • ios