Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ దెబ్బమీద దెబ్బ కొట్టింది, కాంగ్రెస్ కు శిక్ష పూర్తైంది:చంద్రబాబు

దేశ సమైక్యత కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందిన తాను జాతీయ పార్టీలను కలుస్తున్నట్లు తెలిపారు. సేవ్ నేషన్, సేవ్ డెమెక్రసీ పేరుతో దేశ సమైక్యత కోసం బీజేపీ యేతర ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాను కలిసిన అన్ని పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. 

chandrababu naidu briefing on delhi tour
Author
Delhi, First Published Nov 1, 2018, 6:54 PM IST

 


ఢిల్లీ:దేశ సమైక్యత కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందిన తాను జాతీయ పార్టీలను కలుస్తున్నట్లు తెలిపారు. సేవ్ నేషన్, సేవ్ డెమెక్రసీ పేరుతో దేశ సమైక్యత కోసం బీజేపీ యేతర ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాను కలిసిన అన్ని పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. 

మోదీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీబీఐ, ఆర్బీఐ వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేశారన్నారు. ఎన్నడూ లేనివిధంగా దేశచరిత్రలో ఆర్బీఐ సెక్షన్ 7 అమలు చేస్తోందని తెలిపారు.  

నోట్ల రద్దు వ్యవహారంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన తీరు సామాన్యుడి పాలిట శాపంగా మారిందన్నారు. జీఎస్టీ దుష్పరిణామాలను ప్రస్తుతం అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో జరుగుతున్న పరిణామాలపై మెుదటి సారి పర్యటనలో పలు పార్టీల అధినేతలను కలిసినట్లు చెప్పారు. 

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ కుంభకోణమని తెలిపారు. రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణంతోపాటు దేశవిచ్చిన్నానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. బోఫోర్స్ లో లేని రహస్యం రాఫెల్ కుంభకోణంలో ఎందుకు అని మోదీని ప్రశ్నించారు. 

గురువారం రెండోసారి ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే అన్ని పార్టీలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, రాహుల్ గాంధీ, అజిత్ సింగ్ లను కలిసినట్లు తెలిపారు. 

ఆ తర్వాత ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లను కలవనున్నట్లు తెలిపారు. అలాగే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కర్ణాటక సీఎం కుమార స్వామి, మాజీప్రధాని దేవేగౌడలను కలవనున్నట్లు తెలిపారు. 

మోడీ సర్కార్ తీరుతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మోదీ తీసుకున్న ప్రతీ నిర్ణయం సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. నోట్ల రద్దు ఒక అనాలోచిత నిర్ణయమన్న చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు ఫలితం నేటికి అనుభవిస్తున్నట్లు తెలిపారు. డబ్బులు దొరక్క ప్రజలు నేటికి కష్టాలుపడుతున్నారన్నారు. మోదీ హయాంలో ప్రజలు కష్టపడ్డారే తప్ప సంతోషంగా ఉన్న పరిస్థితి ఎక్కడా లేదన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని తాము తమ ఎంపీలు డిమాండ్ చేస్తే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. హోదా ఇవ్వకపోగా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారన్నారు. ఐటీ దాడులతో తమ ఎంపీలను, నేతలను భయాందోళనకు గురి చేశారని తెలిపారు. 

కేంద్రప్రభుత్వంలోని ఉన్నత విభాగాల్లో గుజరాతీలే ఉన్నారని వాళ్లకు నచ్చని వాళ్లపై ఐటీ, ఈడా దాడులతో భయపెడుతున్నారని తెలిపారు. దాడులతో ఎలాంటి సంకేతాలిస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో అయితే ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. 

దేశం ప్రస్తుతం క్లిష్టపరిస్థుల్లో ఉందని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చంద్రబాబు తెలిపారు. అందువల్లే తాను దేశసమైక్యత కోసం కలిసివచ్చే అన్ని పార్టీలను కలుస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీజేపీతోనూ, కాంగ్రెస్ పార్టీతోనూ సమస్యలు ఉన్నాయని అయినా దేశం కోసం వాటన్నింటిని పక్కన పెట్టినట్లు తెలిపారు. 

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయరాజకీయాల్లో  కీలక పాత్ర పోషించిందని తెలిపారు. దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. దేశ ప్రయోజనాలతోపాటు రాష్ట్రప్రయోజనాలు కూడా ముఖ్యమన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న దేశాన్ని పరిరక్షించుకునేందుకు లౌకక వాద పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

ఐక్యతా విగ్రహం ఏర్పాటు ఉద్దేశం ఏంటని చంద్రబాబు మోదీని నిలదీశారు. ఐక్యత అని చెప్తున్న మోదీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చెయ్యడమా అని ప్రశ్నించారు. ఒకవైపు ఏపీపై కక్షసాధింపుకు పాల్పడటం, ఐటీ దాడులతో వేధింపులకు పాల్పడటం వ్యవస్థలను ధ్వంసం చెయ్యడం ఇదా ఐక్యత అంటూ నిలదీశారు. 

దేశం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని దాన్ని గట్టెక్కించడం ప్రపంచం గర్వించదగ్గర దేశాన్ని నిర్మించడం కోసం కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని తెలిపారు. ప్రస్తుతం అన్ని పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని చర్చల అనంతరం ఒక వేదిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేదిక ఏర్పాటులో అన్ని అంశాలపై చర్చించి కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులపై ఆశలేదని, పదవులు అవసరం లేదని కానీ దేశప్రయోజనాలే ముఖ్యమన్నారు చంద్రబాబు.  


 ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

Follow Us:
Download App:
  • android
  • ios