Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థులు వీరే....: క్లియర్ చేసిన చంద్రబాబు

కర్నూలు జిల్లా రాజకీయాల్లో కేఈ, కోట్ల కుటుంబాలు ఒక ఒప్పందానికి రావడంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు.  కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. 
 

chandrababu naidu announced kurnool parliament assembly contestant candidates
Author
Kurnool, First Published Feb 23, 2019, 10:02 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశమైన చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేశారు. 

కర్నూలు జిల్లా రాజకీయాల్లో కేఈ, కోట్ల కుటుంబాలు ఒక ఒప్పందానికి రావడంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు.  కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. 

అలాగే ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అలాగే డోన్ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్, పత్తికొండ అసెంబ్లీ నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబులను ఎంపిక చేశారు. 

రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మంత్రాలయం నియోజకవర్గం నుంచి తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి తిరిగి పోటీ చెయ్యనున్నట్లు తెలిపారు. 

ఇకపోతే బనగానపల్లె నుంచి బీసీ జనార్థన్ రెడ్డి ని ప్రకటించారు. అయితే కర్నూలు, ఆదోని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు సీఎం చంద్రబాబు. కర్నూలు అసెంబ్లీ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ఆశిస్తున్నారు. 

ఇకపోతే ఆదోని నియోజకవర్గం కోసం బుట్టా రేణుక, మీనాక్షి నాయుడులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో ఆ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా చంద్రబాబు ఎంపిక చెయ్యనున్నారని తెలుస్తోంది.  
 

ఈ వార్తలు కూడా చదవండి

కేఈతో ఇబ్బందేమీ లేదు, కలిసి పని చేస్తా: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

కర్నూలులో చంద్రబాబు వ్యూహం: రాజీకొచ్చిన కేఈ, కోట్ల కుటుంబాలు

Follow Us:
Download App:
  • android
  • ios