శిఖా చౌదరితో రాకేష్ ప్రేమాయణం: జయరామ్ ప్రాణాలకు ఎసరు పెట్టింది అదే
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి గంటకో ట్విస్ట్ ఇస్తున్నాడు.. గంటకో రకంగా పోలీసులకు సమాచారాన్ని ఇస్తున్నాడు.
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి గంటకో ట్విస్ట్ ఇస్తున్నాడు.. గంటకో రకంగా పోలీసులకు సమాచారాన్ని ఇస్తున్నాడు.శిఖా చౌదరిపై ఖర్చు పెట్టిన డబ్బులను రాబట్టే క్రమంలోనే జయరామ్‌ను హత్య చేసినట్టుగా మరో కొత్త విషయాన్ని విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాల ఆధారంగా జయరామ్ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, పెద్ద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.
శుక్రవారంతో రాకేష్ రెడ్డి పోలీసు కస్టడీ ముగియనుంది. అయితే ఈ కేసులో గంటకో కొత్త విషయం వెలుగు చూడడంతో పోలీసులు మరో మూడు రోజుల పాటు రాకేష్ రెడ్డిని కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.
శుక్రవారం నాడు విచారణలో మరో కొత్త విషయాన్ని రాకేష్ రెడ్డి బయట పెట్టినట్టు సమాచారం. శిఖా చౌదరితో తాను కొంత కాలం పాటు ప్రేమలో ఉన్నట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం.
శిఖా చౌదరితో ప్రేమాయణం నెరిపిన సమయంలో ఆమెపై సుమారు. రూ.1.5 కోట్లను రాకేష్ రెడ్డి ఖర్చు పెట్టినట్టు ఈ విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం. ఐదు మాసాల క్రితం శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి మధ్య సంబంధాలు తెగిపోయాయి. వీరిద్దరి మధ్య బ్రేకప్ చోటు చేసుకొంది.
తాను ఖర్చు చేసిన రూ.1.5 కోట్లు ఇవ్వనందుకు గాను శిఖా చౌదరి కారును రాకేష్ రెడ్డి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని శిఖా చౌదరి తన మేనమామ జయరామ్‌కు చెప్పింది. శిఖా కోసం ఖర్చు చేసిన డబ్బులను తాను ఇస్తానని జయరామ్ రాకేష్ రెడ్డి వద్ద ఒప్పుకొన్నట్టు ఈ విచారణలో ఆయన ఒప్పుకొన్నాడని సమాచారం.
అయితే రాకేష్ రెడ్డి రూ.1.5 కోట్లకు బదులుగా రూ.4.6 కోట్లను డిమాండ్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ డబ్బుల గురించి రాకేష్ రెడ్డి జయరామ్ వెంటపడ్డాడు. కానీ జయరామ్ డబ్బులు ఇవ్వలేదు.
ఈ డబ్బులను రాబట్టుకొనేందుకు గాను జయరామ్ , శిఖా చౌదరి ఇళ్ల వద్ద రాకేష్ రెడ్డి నిఘా ఏర్పాటు చేశారు. అమెరికా నుండి హైద్రాబాద్‌కు వచ్చిన జయరామ్‌ను హనీ ట్రాప్ చేసి తన ఇంటికి రాకేష్ రెడ్డి రప్పించినట్టుగా పోలీసులు గుర్తించారు..
తన ఇంట్లోనే జయరామ్‌ను రాకేష్ రెడ్డి 19 గంటల పాటు నిర్భంధించినట్టుగా పోలీసులు గుర్తించారు.తనను వదిలేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కూడ జయరామ్ రాకేష్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్టుగా విచారణలో ఒప్పుకొన్నాడని తెలుస్తోంది.
అయితే నిన్ను చంపితే రూ.100 కోట్లు వస్తాయని జయరామ్‌తో రాకేష్ రెడ్డి అన్నట్టుగా ఈ విచారణలో పోలీసులు తెలుసుకొన్నారు. నీ ఆస్తులపై లిటిగేషన్ పెట్టి డబ్బులు వసూలు చేస్తానని రాకేష్ రెడ్డి జయరామ్‌ను బెదిరించినట్టుగా విచారణలో ఒప్పుకొన్నారని తెలుస్తోంది.
రాకేష్ రెడ్డి విచారణలో చెప్పిన ఈ కొత్త అంశాలపై పోలీసులు జయరామ్ హత్య కేసులో కుట్ర ఏమైనా ఉందా... రాకేష్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడ దర్యాప్తును చేయనున్నారు.
సంబంధిత వార్తలు
జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్
జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు
జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ
జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే
జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా
జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు
జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా
జయరామ్ హత్య కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు
ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ
అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య
భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన
శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య
ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు
జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ
జయరామ్ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్
జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే
19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య
శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య
జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు
జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్
జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ
హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు
చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...
జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్
జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?
గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి
జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి
రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?
జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం
వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం
జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు
జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...
శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్
జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి
చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్
హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?
చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?