Asianet News TeluguAsianet News Telugu

తాళ్లరేవు బాణసంచా కేంద్రంలో పేలుడు: తొమ్మిది మందికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Blast at Tallarevu crockery factory in East godavari district
Author
East Godavari, First Published Oct 18, 2019, 6:36 PM IST


కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులోని బాణసంచా కేంద్రంలో పేలుడు సంబవించింది.ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

తాళ్లరేవులో శుక్రవారం నాడు ఓ బాణసంచా తయారీ  చేస్తున్న సమయంలో  షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది.ఈ షార్ట్ సర్క్యూట్ తో  బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో బాణసంచా పేలుడులో బాణసంచా దుకాణం నిర్వహకుడితో పాటు 9 మంది గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

నెల రోజుల  క్రితం తూర్పు గోదావరి జిల్లాలోని వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారు.మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలే కావడం గమనార్హం.

ఈ ఘటన తర్వాత అగ్నిమాపక సిబ్బంది సరైన విధంగా తనిఖీలే చేయని కారణంగా అదే రకమైన ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అనుమతులు లేకుండానే బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహించడం వంటి ఘటనలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. 

ఇటీవలనే కొత్తపేట ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాలపై అగ్నిమాపక అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహించడం వల్ల ఈ తరహా ప్రమాదాలు చోటు చుేసుకొంటున్నాయని  స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలోనే అధికారులు హాడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటేనే ప్రయోజనం ఉంటుందని స్థానికులు అభిప్రాయంతో ఉన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios