Asianet News TeluguAsianet News Telugu

బాబును జేసీ తిడుతున్నారో, పొగుడుతున్నారో అర్ధంకాదు: జీవీఎల్

రెండంతస్తుల భవనం కట్టలేని చేతగాని ప్రభుత్వం చంద్రబాబు సర్కార్‌దేనని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు విభజన గురించి మాకు ముందస్తు సమాచారం లేదని సీఎం అంటున్నారని... ఆయనకు మతిమరుపు వచ్చిందా అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

BJP MP GVL Narasimharao comments on chandrababu
Author
Delhi, First Published Jan 4, 2019, 10:41 AM IST

రెండంతస్తుల భవనం కట్టలేని చేతగాని ప్రభుత్వం చంద్రబాబు సర్కార్‌దేనని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు విభజన గురించి మాకు ముందస్తు సమాచారం లేదని సీఎం అంటున్నారని... ఆయనకు మతిమరుపు వచ్చిందా అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఏం మాట్లాడినా ప్రజలకు ఏం తెలుస్తుందిలే అన్న భావనతో చంద్రబాబు వ్యవహారిస్తున్నారని నరసింహారావు అన్నారు.

లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయించుకుని వీరుల్లా బిల్డప్ ఇవ్వాలన్నట్లు టీడీపీ ఎంపీలు ప్రవర్తించారని దుయ్యబట్టారు. రాజకీయ క్షేత్రంలో ప్రతిఒక్క నాయకుడు ప్రజలకు కూలీలాగే పనిచేయాలని జీవీఎల్ స్పష్టం చేశారు.

చంద్రబాబు రాజకీయ డ్రామాలు చేసి డ్రామానాయుడులాగా ఎదుగుతున్నారని నరసింహారావు వ్యంగ్రాస్త్రాలు సంధించారు. 600 హామీలను ఇచ్చారని, వాటిలో 5 పథకాలను చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానన్ని నిధులు ఏపీకి వస్తున్నాయని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ తెలిపిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలను తిరిగి... అక్కడి ముఖ్యమంత్రులకు గిటార్లు బహుకరించారని దాని వల్ల ఏం సాధించారని జీవీఎల్ ప్రశ్నించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రూ.500 కోట్లు సాయం చేశారని టీడీపీ నేతలే చెప్పారని ఆయన మండిపడ్డారు. తమ నేతను పొగుడుతున్నారో, తిడుతున్నారో అర్థంకానట్టుగా జేసీ మాట్లాడుతున్నారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios