Asianet News TeluguAsianet News Telugu

‘బాలకృష్ణ ఇద్దరిని హత్య చేశాడు..’

అరెస్ట్ చేయాలంటూ బీజేపీ డిమాండ్

bjp leaders sensational comments on hindupuram MLA bala krishna

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ దీక్షకు మద్దతు పలికిన బాలకృష్ణ.. ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో.. చంద్రబాబుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

‘బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆయన తండ్రి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది. ఇంట్లో ఇద్దరిని హత్య చేసి.. మాపీ చేయించిన పెద్దమనిషి బాలకృష్ణ. కుటుంబ పాలన గురించి ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు.  ప్రధానికి, హిజ్రాలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. బాలయ్య సినిమాల్లో స్టంట్లు, ఇంటికి వచ్చిన వాళ్లను కాలుస్తారని తెలుసు.. కానీ మిడిమిడి జ్ఞానంతో కూడా  మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది’అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు విరుచుకుపడ్డారు.

ఇదే విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి సత్యమూర్తి మాట్లాడుతూ... అసలు తెలుగే సరిగా రాని బాలకృష్ణ హిందీలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల గురించి హేళనగా మాట్లాడిన బాలకృష్ణకు, మోదీ గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. మోదీపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణపై కేసులు పెడతామని తెలిపారు. 

ప్రధాని మోదీపై విమర్శలు చేసిన బాలయ్య తన నోరును పినాయిల్‌తో కడుక్కోవాలని సూచించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని.. గతంలో తన నివాసంలోనే ఆయన కాల్పులు జరిపారని ఈ సందర్భంగా సత్యమూర్తి గుర్తుచేశారు. బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా ఓ మెంటల్ హాస్పిటల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు సూచించారు. బీసీ నేత అయిన మోదీ ప్రధానిగా ఉండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఇదే ఘటనపై మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ..చంద్రబాబు దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు తప్పుబట్టారు. గతంలోనూ బాలకృష్ణ అదుపుతప్పి మాట్లాడారని గుర్తుచేశారు. బాలకృష్ణ ప్రధానిని విమర్శిస్తుంటే సీఎం ముసిముసి నవ్వులు నవ్వారని విమర్శించారు. చంద్రబాబు ఒకరోజు దీక్ష వల్ల ఏపీలో పాలన స్తంభించిపోయిందని అన్నారు. చంద్రబాబు అట్టహాసంగా దీక్ష చేశారని, దీక్ష వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తాజాగా చేసిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర సరైన కార్యాచరణ లేదని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios