Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమర్థపాలన కొనసాగతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. మానవజన్మ ఎత్తిన ఎవరైనా ఖండిస్తారన్నారు. 

bjp ap chief kanna laxminarayana on pawan kalyan
Author
Guntur, First Published Oct 26, 2018, 5:50 PM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమర్థపాలన కొనసాగతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్ పై దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. మానవజన్మ ఎత్తిన ఎవరైనా ఖండిస్తారన్నారు. 

ప్రతిపక్ష నేత రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదని కన్నా ఆరోపించారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై దాడి జరిగిందని, అలాగే తనపై కూడా దాడి జరిగిందని ఇప్పుడు జగన్ పై దాడి జరిగిందని మండిపడ్డారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ పై కూడా దాడికి కుట్రలు చేస్తున్నారని కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు అలిపిరిలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో తప్పేంలేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ హత్య చేసే వ్యక్తి లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నానని కన్నా వ్యాఖ్యానించారు. 

ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని కన్నా ఆరోపించారు. ఓ సినిమా యాక్టర్ చెప్పిన వాటిని చదివే స్థాయికి సీఎం దిగజారిపోయారని ఘాటుగా విమర్శించారు. సినీనటుడు శివాజీని తక్షణమే అరెస్ట్ చేసి కుట్రలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

సినిమా నటుడు చదివిన స్క్రిప్ట్ అంతా సీఎం రాసిందేనని కన్నా తెలిపారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ఏడాది సర్వీస్ ఉన్న ప్రసాద్‌రావుని తప్పించి  చంద్రబాబు తన బంధువును డీజీపీగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా మోదీ సీబీఐలో తన బంధువును పెట్టుకోలేదని కన్నా స్పష్టం చేశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబా

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

Follow Us:
Download App:
  • android
  • ios