Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలోకి భాష్యం విద్యాసంస్థల అధినేత:పెదకూరపాడు నుంచి బరిలోకి...?

ఒకవైపు ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రజాపోరాట యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు పోటాపోటీగా జెట్ స్పీడ్ తో ప్రచారాలతో దూసుకుపోతుండటంతో టీడీపీ ఉలిక్కిపడుతోంది. 
 

bhashyam chairman ramakrishna likely joins to tdp
Author
Guntur, First Published Dec 2, 2018, 10:40 AM IST

గుంటూరు: ఒకవైపు ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రజాపోరాట యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు పోటాపోటీగా జెట్ స్పీడ్ తో ప్రచారాలతో దూసుకుపోతుండటంతో టీడీపీ ఉలిక్కిపడుతోంది. 

ఒకప్పుడు తాము అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు శత్రువుగా మారడం, ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రరాజకీయాల్లో మరింత పట్టు సాధించడంతో చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపికపై కససరత్తు చేస్తున్నారు. అదీ కూడా టీడీపీ చరిత్రలో లేని విధంగా ఆరు నెలల ముందు నుంచే. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఇప్పటి నుంచే అభ్యర్థుల వేట మెుదలెట్టారు. 

కృష్ణా,గుంటూరు వంటి జంట నగరాల్లో ఏ ఒక్క సీటు ఓడిపోకూడదనే కసితో ఉన్నారట. అందులో భాగంగానే ఒక్కో నియోకవర్గంపైనా సర్వేలు చేయించి అభ్యర్థుల మార్పులు చేర్పులపై దృష్టి సారించారు.

అందులో భాగంగా తొలుత గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు ప్రతికూల గాలి వీస్తోందని చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. 

ఇకపోతే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి  శ్రీధర్ రెండు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009లోనూ, ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ శ్రీధర్ భారీ విజయం సాధించారు. 

అలాగే రాజధానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం కావడంతో అభివృద్ధి కూడా బాగానే జరిగింది. రాజధాని రావడంతో ఈ నియోజకవర్గంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.  

అయితే చంద్రబాబు నాయుడు వద్ద రిపోర్ట్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ పై నెగిటివ్ గా ఉంది. అభివృద్ధి విషయంలో దూసుకుపోతున్నా అవినీతి ఆరోపణలు ఘోరంగా ఉన్నాయని నివేదికలో ఉందట. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరని చంద్రబాబు సర్వేలో తేలింది. 

అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది. అలాగే ఇసుక దందా, సదావర్తి భూమల కుంభకోణం వంటి అంశాలపై అనేక ఆరోపణలు చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. 

ఈ పరిణామాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చంద్రబాబు శ్రీధర్ నియోజకవర్గం మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  

ఇకపోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్ అవినీతిపై ధ్వజమెత్తారు. అనుచరుల ఇసుక దందా, సదావర్తి భూముల కుంభకోణం వంటి అంశాలను పదేపదే ప్రస్తావించారు. జగన్ ఆరోపణలు కూడా శ్రీధర్ సీటుకు ఎసరు తెచ్చేందుకు కారణమైంది. 

దీంతో ఈ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణను బరిలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని జోరుగా ప్రచారం  జరుగుతోంది. భాష్యం విద్యాసంస్థల అధినేతగా రామకృష్ణకు మంచి పేరు ఉండటంతో ఆయనకు టిక్కెట్ ఇస్తే గెలుపు గ్యారంటీ అని చంద్రబాబు భావిస్తున్నారట. 

ఈ నేపథ్యంలో పెదకూరపాడు టిక్కెట్ భాష్యం రామకృష్ణకు టిక్ పెట్టేశారని టాక్. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబుతో భాష్యం రామకృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేరళ వరద బాధితుల సహాయార్థం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రూ.2 కోట్ల 7లక్షల విరాళాన్ని సైతం అందజేశారు. 

అలాగే ఏపీలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు భాష్యం రామకృష్ణ కుమారుడు సాకేత్‌రామ్‌ రూ.27లక్షల విరాళం అందజేసి చంద్రబాబు మన్నలను పొందారు. అదే సమయంలో రామకృష్ణ తమ కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడుకు పరిచయం చేశారు.  

ఆ సమావేశంలో పెదకూరపాడు నియోజకవర్గం ఆఫర్ పై చంద్రబాబు ప్రస్తావించారని తెలుస్తోంది. సీటుపై కూడా సమాలోచనలు జరిపారని అయితే చంద్రబాబు ఇష్టానికే నిర్ణయం రామకృష్ణ వదిలేశారని తెలుస్తోంది. పోటీ చెయ్యమంటే చేస్తానని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   

భాష్యం రామకృష్ణ కూడా టీడీపీలో చేరితే ఏపీలోని కీలక విద్యాసంస్థలు అధినేతలంతా టీడీపీలో ఉన్నట్లే. ఇప్పటికే నారాయణ విద్యాసంస్థల అధినేత మంత్రి నారాయణ, కైట్ విద్యాసంస్థల అధినేత చైతన్యరాజు, విశ్వం ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ అధినేత పోతుల విశ్వం, గీతం యూనివర్శిటీ, అవంతి విద్యాసంస్థల అధినేత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఇలా అనేక విద్యాసంస్థల అధినేతల సరసన భాష్యం రామకృష్ణ చేరబోతున్నారన్నమాట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios