Asianet News TeluguAsianet News Telugu

బద్వేలు మున్సిపాలిటీలో నిరాహారదీక్ష

బద్వేలు మున్సిపాలిటీ టిడిపి చేతిలోనే ఉంది. మామూలుగా మున్సిపాలిటీలో ప్రతిపక్షం గెలిస్తే అలాంటి మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. కానీ ఇక్కడ గెలిచిందీ టిడిపినే, అధికారంలో ఉన్నదీ టిడిపి ప్రభుత్వమే. అయినా అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వటం లేదన్నదే ప్రశ్న.

Badvel chairman and councilors resorted to hunger strike

కడపజిల్లా బద్వేలు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు నిరాహా దీక్షకు దిగటం పార్టీ, ప్రభుత్వంలో సంచలనంగా మారింది. చంద్రబాబునాయుడు తమ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వటం లేదంటూ మున్సిపల్ ఛైర్మన్ తో పాటు కౌన్సిలర్లు శనివారం నుండి నిరాహారదీక్షకు దిగారు. మొదటి నుండి కూడా ప్రభుత్వం తమ మున్సిపాలిటీ పరిదిలో అభివృద్ది కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయటం లేదని వారు ఆరోపించారు.

నాలుగు మాసాల క్రితం జరిగిన స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా తమతో చంద్రబాబు సమావేశమైన విషయాన్ని ఛైర్మన్, కౌన్సిలర్లు గుర్తు చేస్తున్నారు. ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధికి ఓట్లు వేస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే, ఎన్నికలైపోయి నాలుగు నెలలైనా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే బద్వేలు మున్సిపాలిటీ టిడిపి చేతిలోనే ఉంది. మామూలుగా మున్సిపాలిటీలో ప్రతిపక్షం గెలిస్తే అలాంటి మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. కానీ ఇక్కడ గెలిచిందీ టిడిపినే, అధికారంలో ఉన్నదీ టిడిపి ప్రభుత్వమే. అయినా అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వటం లేదన్నదే ప్రశ్న. పోయిన ఎన్నికల్లో ఎంఎల్ఏగా వైసీపీ తరపున జయరాములు గెలిచారు. అయితే, చాలా కాలం క్రితమే ఆయన కూడా టిడిపిలో చేరిపోయారు. అయినా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో?

Follow Us:
Download App:
  • android
  • ios