Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై దాడి.. ప్రత్యక్ష సాక్షి నేనే.. ఎమ్మెల్యే

కత్తితో దాడి చేసిన వెంటనే నన్ను కొట్టొద్దు, పోలీసులకు అప్పగించండి అని మాత్రమే నిందితుడు అన్నాడని పేర్కొన్నారు.

attack on jagan mla ijayya says he is the eyewitness
Author
Hyderabad, First Published Oct 26, 2018, 3:36 PM IST

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ప్రత్యక్ష సాక్షి తానేని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. గురువారం జగన్ పై దాడి జరగగా.. ఈ రోజు ఐజయ్య మీడియాతో మాట్లాడారు. జగన్ పై జరిగిన దాడి చాలా హేయమైనదని ఆయన అన్నారు.

జగన్‌పై దాడి జరిగనపుడు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. సెల్ఫీ కోసం వచ్చి రెప్పపాటులో కత్తితో దాడి చేసి చంపాలని ప్రయత్నించాడని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన వెంటనే నన్ను కొట్టొద్దు, పోలీసులకు అప్పగించండి అని మాత్రమే నిందితుడు అన్నాడని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై ఎవరూ దాడి చేయవద్దు..పోలీసులకు అప్పగించండని మాత్రమే ఆ సమయంలో జగన్‌ చెప్పారని తెలిపారు. ఎయిర్‌పోర్టులో ప్రథమ చికిత్స అనంతరం టీటీ వేయించుకుని జగన్‌ హైదరాబాద్‌ వెళ్లారని స్పష్టం చేశారు. 

కాగా..గన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.టీడీపీ వారు అన్నట్లుజగన్‌ దాడి జరిగిన తర్వాత పక్క రాష్ట్రం వెళ్లిపోయాడని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు, హైదరాబాద్‌ నుంచి పారిపోయారు కానీ జగన్‌కు హైదరాబాద్‌కు  వెళ్లడానికి ఎలాంటి భయం అవసరం లేదని వ్యాఖ్యానించారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్న విషయం ముఖ్యమంత్రి మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని ఐజయ్య పేర్కొన్నారు. జగన్‌పై జరిగిన దాడిని స్వతంత్ర్య దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios