Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక ఫలితాలు మోదీ పతనానికి నాంది:ఏపీ మంత్రులు

 కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలపై ఏపీ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపొందడాన్ని స్వాగతించారు. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు మోదీ పతనానికి నాంది అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయడ్డారు.  

 

ap ministers reactions on karnataka by poll results
Author
Amaravathi, First Published Nov 6, 2018, 12:45 PM IST

అమరావతి: కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలపై ఏపీ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపొందడాన్ని స్వాగతించారు. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు మోదీ పతనానికి నాంది అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయడ్డారు.  

కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్‌ను చీల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 

బీజేపీ కుట్రలకు కన్నడ ప్రజలు తమ ఓటు హక్కుతో గుణపాఠం చెప్పారన్నారు. కర్ణాటక ఉపఎన్నికల్లో ఐదింట నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించడం శుభపరిణామమన్నారు. 

మరోవైపు శివమొగ్గలో యడ్యూరప్ప కుమారుడు గెలుపు కేవలం డబ్బులు కుమ్మరించడం వల్లే సాధ్యమైందన్నారు. వందలకోట్లు దారపోయడం వల్లే గెలిచారని సోమిరెడ్డి విమర్శించారు. జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే సూచిక అంటూ సమర్ధించుకున్నారు. మోదీ గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. 


తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్-జేడీఎస్ మెజార్టీ సాధించిందని మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. కర్ణాటక ఉపఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి లభించిన ఫలితం 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు ఏర్పాటు చేసిన బీజేపీ యేతర కూటమికి ఈ ఫలితాలే నాంది అన్నారు. 

మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ఇప్పటికే మొదలైందని, కర్ణాటకలో వచ్చిన ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు ప్రభావంతో మహాకూటమి విజయం సాధిస్తుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో: కేసీఆర్‌పై జేసీ పరోక్ష వ్యాఖ్యలు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: గాలి బ్రదర్స్‌కి షాక్..బళ్లారిలో కాంగ్రెస్ ఘనవిజయం

Follow Us:
Download App:
  • android
  • ios