Asianet News TeluguAsianet News Telugu

ఏపీ డీఎస్సీ పరీక్షా ఫలితాలు.. గంటా ప్రకటన

డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15వ తేదీన ప్రకటిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

ap minister ganta srinivasa rao released important exam dates details
Author
Hyderabad, First Published Feb 12, 2019, 12:49 PM IST


డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15వ తేదీన ప్రకటిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పదోతరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేస్తామని ఆయన చెప్పారు. వీటితోపాటు పలు ముఖ్యమైన ప్రవేశపరీక్షలు, వాటి ఫలితాలను వెల్లడించే తేదీల వివరాలను కూడా ఆయన తెలిపారు.

మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరుగతాయని.. ఏప్రిల్ 27న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. మొత్తం 6,21,623మంది విద్యార్థులు పరీక్షకు హాజరౌతారని..2,838 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 27నుంచి మార్చి 18వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

ఇంటర్ పరీక్షలకు 10,17,600మంది విద్యార్థులు హాజరౌతున్నారని.. మొత్తం 1430 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని..ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదలౌతాయని తెలిపారు.

ఏప్రిల్ 19న ఏపీ ఈసెట్ పరీక్ష.. మే 30వ తేదీన ఫలితాలు, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్ పరీక్షలు..మే1 ఫలితాలు, ఏప్రిల్ 26న ఐసెట్..మే 3వ తేదీన ఫలితాలు, మే1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్ పరీక్షలు..మే 11న ఫలితలాలు ప్రకటిస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios