Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస్ కి భద్రత కల్పిస్తాంః:హోం మంత్రి చినరాజప్ప భరోసా

 వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కి భద్రత కల్పిస్తామని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప భరోసా ఇచ్చారు. ఈ కేసు విచారణలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. ఈ ఘటనపై కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, విచారణలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చినరాజప్ప స్పష్టంచేశారు.
 

Ap home minister chinarajappa comments on accused srinivas situation
Author
Amaravathi, First Published Oct 31, 2018, 5:52 PM IST

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కి భద్రత కల్పిస్తామని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప భరోసా ఇచ్చారు. ఈ కేసు విచారణలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. ఈ ఘటనపై కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, విచారణలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చినరాజప్ప స్పష్టంచేశారు.

సిట్ దర్యాప్తుపై వైసీపీ నేతలు తమకు నమ్మకం లేదనడాన్ని చినరాజప్ప ఖండించారు. దర్యాప్తులో నిస్పక్షపాతంగా జరుగుతుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని ఎక్కడా అలసత్వం వహించడం లేదని చెప్పారు.

ఇకపోతే నిందితుడు శ్రీనివాస్ మంగళవారం కేజీహెచ్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు. జగన్‌ అంటే తనకు ప్రాణమని, తనంతట తానే జగన్ పై దాడి చేశానంటూ నిందితుడు చెప్పాడు. జగన్‌పై దాడి రాజకీయంగా మారిపోయిందని, తన ప్రాణాలకు హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు. 

తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ వాపోయాడు. ఒకవేళ తాను చనిపోతే తన అవయవాలు దానం చేయండంటూ శ్రీనివాసరావు మీడియాతో వాపోయాడు. అంతేకాదు శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవైంది. 

అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాస్ పోలీస్ విచారణలో పూర్తిగా నీరసించిపోయినట్లు కనిపించడంతో వైసీపీ నేతలు పలు విమర్శలు చేశారు. శ్రీనివాస్ ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ స్టేట్‌మెంట్‌కోసం మరోసారి ఏపీ పోలీసుల యత్నం సిట్ అధికారులను శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏం కోరారంటే... జగన్ ను అరెస్ట్ చేస్తారా, దమ్ముంటే చెయ్యండి: మంత్రులకు మేరుగ సవాల్

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు 

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

Follow Us:
Download App:
  • android
  • ios