Asianet News TeluguAsianet News Telugu

వంశీ విషయంలో ఆ హింట్ నిజమే, అయితే ఆ 16 మంది ఎమ్మెల్యేలు..: చంద్రబాబులో టెన్షన్

వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్న ఆ పదహారు మంది ఎవరంటూ టీడీపీలో జోరుగా చర్చ జరుగుతుందట. రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన కొద్దిరోజులకే నలుగురు రాజ్యసభ సభ్యలు సైకిల్‌ దిగిపోయి కాషాయికండువా కప్పేసుకున్నారు. 

ap deputy cm narayanaswamy sensational comments on tdp mlas
Author
Amaravathi, First Published Nov 6, 2019, 3:21 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఉంటాయో లేదో తెలియదు గానీ వైసీపీ నేతలు మాత్రం తమతో ఇంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, అంతమంది టచ్ లో ఉన్నారంటూ టీడీపీ శిబిరంలో ఆందోళనకు తెరలేపుతున్నారు. 

వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ముందుగానే వైసీపీ నేతలు హింట్ ఇచ్చారు. వంశీ అసంతృప్తితో ఉన్నారంటూ ఆరోపించారు. వైసీపీ ప్రచారం కాస్త వాస్తవరూపం దాల్చడంతో ఫిరాయింపులపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ప్రత్యేక దృష్టి సారించింది టీడీపీ. 

ఈదశలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నిత్యం సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్ లతో హల్ చల్ చేస్తున్నారు చంద్రబాబు. ఇలాంటి సమయంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పడంతో తెలుగుదేశం శిబిరంలో గుబులు రేపుతోంది. ఉపముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా అంటూ టీడీపీ ఆరా తీస్తుంది. 

ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ హ్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో టీడీపీ శాసన సభ్యుల సంఖ్య 23 నుంచి 22కి పడిపోయింది. అసలు పార్టీలో ఎంత మంది ఉంటారు...ఎంతమంది జంప్ అవుతారు... వంశీబాటలో నడిచే ఎమ్మెల్యేలు ఇంకెంతమంది ఉన్నారు అన్న కోణంలో టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.  

తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య వలసలపై హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. దాంతో ఏపీలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే మరోవైపు జంప్‌ జిలానీలు కండువాల మార్పిడికి రెడీ అవుతున్నారన్న ప్రచారం రాజకీయాల్లో దుమారం రేపుతోంది.  

ఇకపోతే వల్లభనేని వంశీమోహన్ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసేటప్పుడు కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఒక సీనియర్‌ నేత తనను ఇబ్బంది పెట్టారని అందువల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖలో తెలిపారు. 

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుల్లో వంశీ ఒకరుగా టీడీపీ చెప్తోంది. అలాంటి వంశీయే పార్టీలోని సీనియర్ నేత వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపణలు చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని చంద్రబాబు ఆరా తీస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో అసంతృప్తితో రగిలిపోతున్న నేతల జాబితా సిద్ధం చేయిస్తున్నారట.   

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. తమ పార్టీతో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని….మీరు రండి అంటూ జగన్‌ ఒక్క మాట అంటే చాలు వారంతా చంద్రబాబును వదిలేసి తమ పార్టీలోకి చేరిపోతారంటూ కామెంట్‌ చేయడంపై అంతటి పరిస్థితి టీడీపీలో నెలకొందా అనే అంశంపై చర్చ జరుగుతుంది.  

వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్న ఆ పదహారు మంది ఎవరంటూ టీడీపీలో జోరుగా చర్చ జరుగుతుందట. రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన కొద్దిరోజులకే నలుగురు రాజ్యసభ సభ్యలు సైకిల్‌ దిగిపోయి కాషాయికండువా కప్పేసుకున్నారు. 

టీడీపీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ నెలకొనలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కొద్దోగొప్పో సీట్లు గెలుచుకున్నప్పటికీ అందులో చంద్రబాబుతో ఉండేదెవరో ఊడేదెవరో అనే అంశంపైనే నిత్యం చర్చ జరుగుతుంది.  తుందో చూడాలి. 

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పినట్లు ఆ పదహారు మంది జగన్ ఆదేశాల కోసమే ఎదురుచూస్తున్నారా....ఒక వేళ జగన్ వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా హుళక్కేనని ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం

వల్లభనేని వంశీ ఫ్యాక్టర్: టీడీపీలో కుమ్ములాటలు, చంద్రబాబుకు అగ్నిపరీక్ష

Follow Us:
Download App:
  • android
  • ios