Asianet News TeluguAsianet News Telugu

తీరం దాటిన పెథాయ్, చంద్రబాబు సమీక్ష

పెథాయ్ తుఫాన్‌ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో కాకినాడ - యానం మధ్య పెథాయ్ తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.  
 

ap cm chandrababu naidu review on pethai cyclone
Author
Amaravathi, First Published Dec 17, 2018, 8:11 PM IST

అమరావతి: పెథాయ్ తుఫాన్‌ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో కాకినాడ - యానం మధ్య పెథాయ్ తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.  

సముద్రంలోనే తుఫాన్ బలహీనపడటంతో ఈదురుగాలుల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టాయి. తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో దాని ప్రభావంతో రాగల 24గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 166 మి.మీ మేర వర్షపాదం నమోదైంది. 

తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పెథాయ్ తుఫాన్  నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం, పశు నష్టం నివారించగలిగామని తెలిపారు. విద్యుత్ సమస్యలు నెలకొన్న ప్రాంతంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

తుఫాన్ ప్రభావంతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పంటనష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మెుత్తం 14వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. సుమారు రూ.51.56 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలలో 405 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా రూ.9.65 కోట్లు వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాస్ట్ర వ్యాప్తంగా 80 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని, అలాగే 219 విద్యుత్ స్థంభాలు దెబ్బతినగా 120 విద్యుత్ స్థంభాలను పునరుద్దరించినట్లు తెలిపారు. తుఫాన్ తీవ్రతను ముందుగానే అంచనా వెయ్యడం వల్ల 11.81 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కొల్లేరు ప్రాంతంలో చలిగాలుల తీవ్రతతో 300 గొర్రెలు చనిపోయాయి. ఇకపోతే తుఫాన్ సహాయక చర్యల్లో 2000 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నట్లు చంద్రబాబు తెలిపారు. తుఫాన్ ధాటికి 297 సెల్ టవర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. 

అలాగే 90 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 460 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే 538  తుఫాన్ సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

ఏపీలో ‘‘పెథాయ్’’ విలయ తాండవం

పెథాయ్ తుఫాన్: తెలంగాణ‌పై ఎఫెక్ట్

పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

‘‘పెథాయ్’’ బీభత్సం: ఏపీలో రైళ్ల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు

 

Follow Us:
Download App:
  • android
  • ios