Asianet News TeluguAsianet News Telugu

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాను కలిశారు. 

Ap cm chandrababu naidu meets sarad pawar, faruq abdulla
Author
Delhi, First Published Nov 1, 2018, 2:38 PM IST

ఢిల్లీ: ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాను కలిశారు. 

దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీ యేతర కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై చంద్రబాబు నాయుడు ఇరు నేతలతో చర్చించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని అంతా కలిసి రావాల్సిన సమయం ఏర్పడిందని సూచించారు. 

 

చంద్రబాబు నాయుడు చర్చలతో ఇరునేతలు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిసి పనిచెయ్యాలని చంద్రబాబు సూచించారని అందుకు తాను సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నారు. 

సీబీఐ వ్యవహారం దగ్గర నుంచి ఆర్బీఐ వరకు అన్ని రంగాలను కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఫరూక్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల నేపథ్యంలో అంతా కలిసి పనిచేద్దాం అని యోచిస్తున్నట్లు తెలిపారు. 

దేశంలో ప్రస్తుత జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శరద్ పవార్, ఫరూక్ అబ్ధుల్లాతో సమావేశమైన అనంతరం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా కలిసి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. తనకంటే సీనియర్ రాజకీయ నాయకులైన శరద్ పవార్, ఫరూక్ అబ్ధుల్లాతో కలిసి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వివరించినట్లు తెలిపారు. 

బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడమే తన లక్ష్యమని అందుకు అవసరమైతే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుస్తానని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తో సైతం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సాయంత్రం 3.30గంటలకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలను కలుపుకుని భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. 

 

 

ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios