Asianet News TeluguAsianet News Telugu

చంద్రగిరిలో రీ పోలింగ్: చంద్రబాబుకు సీఈఓ ద్వివేది కౌంటర్

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. 
 

ap chief electoral officer gopala krishna dwivedi reacts on re polling in chandragiri segment
Author
Amaravathi, First Published May 17, 2019, 5:55 PM IST

అమరావతి: చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో ఈ నెల 19వ తేదీన రీ పోలింగ్ నిర్వహించడంపై  ఆయన స్పందించారు.

ఈ పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలు చోటు చేసుకొన్నట్టుగా బలమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయని ఆయన తేల్చి చెప్పారు. వీడియోలు చూస్తే  ప్రజాస్వామ్యంలో ఇలా కూడ ఉంటుందా అని ఆనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో సాక్ష్యం బలంగా ఉన్న కారణంగానే రీ పోలింగ్  నిర్వహించాల్సి వస్తోందని ద్వివేది చెప్పారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.

 చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  ఈ ఘటన ఆలస్యంగా తెలియడంతో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆయన తెలిపారు.  తన రిపోర్ట్‌లో వాస్తవం లేకపోతే ఈసీ రీ పోల్ నిర్వహించదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే చంద్రగిరి అసెంబ్లీతో పాటు రాష్ట్రంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 పోలింగ్ బూత్‌ల్లో కూడ రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎస్‌కు శుక్రవారం నాడు టీడీపీ నేతలు, మంత్రులు ఇచ్చిన  వినతి పత్రం ఇచ్చారు.ఈ విషయమై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి  లేఖ నోట్ పంపారు.


సంబంధిత వార్తలు

చంద్రగిరిలో రీ పోలింగ్: సీఎస్‌తో టీడీపీ ప్రజా ప్రతినిధుల భేటీ

చెవిరెడ్డిని అడ్డుకొన్న ఎన్ఆర్. కమ్మపల్లి గ్రామస్తులు, ఉద్రిక్తత

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us:
Download App:
  • android
  • ios