Asianet News TeluguAsianet News Telugu

ఏపి డీఎస్సి వాయిదా....

ఆంధ్ర ప్రదేశ్ లో టీచర్ పోస్టుల నియామకం కోసం ప్రభుత్వం భారీ పోస్టులతో డీఎస్సిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 6వ తేదీ నుండి ఈ పోస్టుల ఎంపికకు రాత పరీక్ష జరగాల్సి ఉండగా వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాల తర్వాత అంటే డిసెంబర్ 19 వ తేదీ నుండి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది.    
 
andhra pradesh dsc postponed
Author
Amaravathi, First Published Nov 28, 2018, 5:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో టీచర్ పోస్టుల నియామకం కోసం ప్రభుత్వం భారీ పోస్టులతో డీఎస్సిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 6వ తేదీ నుండి ఈ పోస్టుల ఎంపికకు రాత పరీక్ష జరగాల్సి ఉండగా వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాల తర్వాత అంటే డిసెంబర్ 19 వ తేదీ నుండి ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది.    

ప్రభుత్వ, మున్సిపల్‌, జెడ్‌పి, ఎంపిపి, మున్సిపల్‌ గురుకుల, మోడల్‌, బిసి, ఎపి రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉపాద్యాయ ఖాళీల భర్తీకోసం అక్టోబర్‌ 26న పాఠశాల విద్యాశాఖ డిఎస్‌సి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం  7907 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. దీంతో ఈ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు భారీ ఎత్తున్న దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు  6,07,311 అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

అయితే ప్రభుత్వం ముందుగా ప్రకటించచిన షెడ్యూల్ ప్రకారం కాకుండా పరీక్షలను రెండు వారాలు వాయిదా వేసింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 19 నుంచి 22 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్‌ 23,24  తేదీల్లో పీజీటీ, డిసెంబర్‌ 26,27 తేదీల్లో టీజీటీ, డిసెంబర్‌ 28న లాంగ్వేజ్‌, పీఈటీ పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్‌ 29 నుంచి జనవరి 4 వరకు ఎస్‌జీటీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios