Asianet News TeluguAsianet News Telugu

సర్వే: కాంగ్రెసుతో దోస్తీ చంద్రబాబుకు ప్లస్, తగ్గిన జగన్ హవా

సీ ఓటరు సర్వే ప్రకారం... కాంగ్రెసు, టీడీపి దోస్తీ వల్ల వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 లోకసభ స్థానాలున్నాయి. 

Alliance with Congress will help TDP in AP
Author
Amaravathi, First Published Dec 26, 2018, 12:18 PM IST

అమరావతి: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో దోస్తీ కట్టడం ఆయనకు కలిసి వస్తున్నట్లు సర్వేలో తేలింది. సీ ఓటరు సర్వే ప్రకారం... కాంగ్రెసు, టీడీపి దోస్తీ వల్ల వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ 14 సీట్లను కైవసం చేసుకుంటుందని సీ ఓటర్ సర్వే తేల్చింది. కాంగ్రెసు, తెలుగుదేశం పొత్తు ఈ రెండు పార్టీలకు కూడా కలిసి వస్తుంది. తెలుగుదేశం 8 స్థానాలను, కాంగ్రెసు 3 స్థానాలను గెలుచుకుంటాయి.

వైఎస్సార్ కాంగ్రెసు 21 లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని అక్టోబర్ లో నిర్వహించిన సర్వే తేల్చింది. తెలుగుదేశం పార్టీకి కేవలం 4 స్థానాలు దక్కుతాయని తేలింది. 

తాజా సర్వే ప్రకారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి 41.6 శాతం ఓట్లు, టీడీపి - కాంగ్రెసు కూటమికి 38.2 శాతం ఓట్లు పోలవుతాయని, బిజెపికి 11 శాతం, ఇతరులకు 9.3 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తేల్చింది. 

రెండు నెలల కాలంలో ఎపిలో రాజకీయ పరిస్థితి మారిపోయింది. వైసిపి 21 సీట్ల నుంచి 14 సీట్లకు తగ్గిపోగా, తెలుగుదేశం పార్టీ 4 సీట్ల నుంచి 8 సీట్లకు పెరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios