Asianet News TeluguAsianet News Telugu

మంత్రులపై సిఎంకు ఫిర్యాదు చేసిందా ?

  • తమ నియోజకవర్గంలోనే తనను అందరూ కలిసి ఒంటిరిని చేస్తున్న విషయాన్ని వివరంగా చెప్పారట.
  • ఒకరకంగా నంద్యాలకు వస్తున్న మంత్రులందరినీ సుబ్బారెడ్డి హైజాక్ చేస్తున్నట్లే ఉంది.
  • అయితే, మొత్తం విన్న చంద్రబాబు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండానే అఖిలను పంపేసారట.
  • రేపటి ఎన్నికల్లో ఫలితం ఎలాగున్నా తనకెంతమాత్రం సంబంధం లేదన్నట్లుగా మంత్రి ముందుజాగ్రత్తగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
Akhila  neither here nor there in Nandyala

నంద్యాల ఉపఎన్నికలో మంత్రి అఖిలప్రియ ఒంటరైపోయిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలలో ఉపఎన్నిక అనివార్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. తన తండ్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో అన్నీ తానై ముందుండి నడిపించాలని అఖిల మొదట అనుకున్నారు. అందుకు తగ్గట్లే అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా అఖిలప్రియ చెప్పినట్లే చంద్రబాబునాయుడు ఖరారూ చేసారు. ఇంకేముంది ఎక్కడ చూసినా అఖిలే అని అందరూ అనుకున్నారు.

అయితే, అక్కడి నుండే సీన్ మొత్తం మారిపోయింది. తాను కోరినట్లే అభ్యర్ధిని ఓకే చేసిన చంద్రబాబు తర్వాత వ్యవహారాలను సహచర మంత్రులు కాలువ శ్రీనివాసులు, నారాయణ, కెఇ కృష్ణమూర్తిలకు అప్పగించారు. దాంతో అఖిల ఖంగుతిన్నది. ఆ సంగతిని పక్కన బెడితే ప్రతీ రోజూ పలువురు మంత్రులు నంద్యాలకు వచ్చి పోతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా అఖిలను కలవటం లేదట. ఎందుకంటే, ఎన్నికను ఒంటరిగా అఖిల ఎదుర్కొనలేందని చంద్రబాబు అనుకున్నారు.

అందుకనే భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే, అప్పటికే ఏవి సుబ్బారెడ్డికి మంత్రికి మద్య సంబంధాలు చెడింది. దాన్ని ఏవి అవకాశంగా మలుచుకున్నారు. నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్న మంత్రులందరినీ తన ఇంటికే తీసుకెళుతున్నారు సుబ్బారెడ్డి. లేకపోతే ఓ హోటల్లో బస ఏర్పాటు చేస్తున్నారు. నేతలు, కార్యకర్తలతో మంత్రుల సమావేశాలు, ఎన్నికల వ్యవహారాలన్నీ సుబ్బారెడ్డి ఇంటి నుండి కానీ లేదా ఆ హోటల్ నుండే నడుస్తున్నాయట. అంటే ఒకరకంగా నంద్యాలకు వస్తున్న మంత్రులందరినీ సుబ్బారెడ్డి హైజాక్ చేస్తున్నట్లే ఉంది.

దాంతో అఖిల బాగా ఇబ్బందులు పడుతోందట. ఇక ఉండబట్టలేక ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద కూడా ఫిర్యాదు చేసిందట. తమ నియోజకవర్గంలోనే తనను అందరూ కలిసి ఒంటిరిని చేస్తున్న విషయాన్ని వివరంగా చెప్పారట. అయితే, మొత్తం విన్న చంద్రబాబు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండానే అఖిలను పంపేసారట. రేపటి ఎన్నికల్లో ఫలితం ఎలాగున్నా తనకెంతమాత్రం సంబంధం లేదన్నట్లుగా మంత్రి ముందుజాగ్రత్తగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

 

Follow Us:
Download App:
  • android
  • ios